ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ , రకుల్ ప్రీత్ సింగ్ జంటగా గ్రామీణ నేపథ్యం లో సన్నపు రెడ్డి వెంకట రామి రెడ్డి నవల “కొండపొలం” ఆధారంగా రూపొందిన ”కొండపొలం ” మూవీ అక్టోబర్ 8 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో సాయి చంద్ , కోట , నాజర్ , అన్నపూర్ణ , హేమ ముఖ్య పాత్రలలో నటించారు. కీరవాణి సంగీతం అందించారు. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో అడ్వెంచరస్ మూవీగా రూపొందిన ఈ మూవీ లో కటారు రవీంద్ర యాదవ్‌గా వైష్ణవ్ తేజ్, ఓబులమ్మ అనే గ్రామీణ యువతిగా రకుల్ ప్రీత్ సింగ్ నటించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , సాంగ్స్ , టీజర్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుని మూవీ పై అంచనాలు పెంచాయి. తాజాగా చిత్ర యూనిట్ “కొండపొలం” మూవీ మేకింగ్ వీడియోను రిలీజ్ చేసింది. వికారాబాద్ ఫారెస్ట్ ఏరియాలో “కొండ పొలం”చిత్రాన్ని దట్టమైన అడవులు – కొండ ప్రాంతాల్లో చిత్రీకరించడానికి టీమ్ చాలా కష్టపడినట్టు , అడవుల్లోకి అధిక సంఖ్యలో గొర్రెలను తీసుకెళ్లి. ఆ మూగ జీవాలను కంట్రోల్ చేస్తూ వాటి మధ్యనే షూటింగ్ జరిపినట్లు ఈ మేకింగ్ వీడియో రూపొందింది. ఈ మూవీ కై హీరోయిన్ రకుల్ ప్రీత్ ప్రత్యేక భాషను నేర్చుకొనడం విశేషం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: