శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై భారీ తమిళ చిత్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , కియారా అద్వానీ జంటగా “#RC15” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హీరో రామ్ చరణ్ యువ ఐఏఎస్ గా ఒక డైనమిక్ రోల్ లో నటిస్తున్న ఈ మూవీ లో తమన్నా , అంజలి కీలక పాత్రలలో నటించనున్నారని సమాచారం.”#RC15” మూవీ కి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
#RC15” మూవీ అన్నపూర్ణ స్టూడియోస్ లో సెప్టెంబర్ 8న చిరంజీవి క్లాప్ తో ప్రారంభం అయిన విషయం తెలిసిందే. “#RC15” మూవీ కై పుణెలో ప్రత్యేకంగా ఓ సెట్ రూపొందిస్తున్నారనీ , ఆ సెట్ లో ఈ నెలలోనే చిత్రీకరణ ప్రారంభించనున్నట్టు సమాచారం. హీరో రామ్ చరణ్ , ఇతర తారాగణం పాల్గొనగా యాక్షన్ సన్నివేశాలు తెరకెక్కించడానికి దర్శకుడు శంకర్ ప్లాన్ చేశారు. యాక్షన్ షెడ్యూల్ ముగిసిన తర్వాత హీరో హీరోయిన్ కాంబినేషన్ సీన్స్ దర్శకుడు తెకెక్కించనున్నారు. నవంబర్ నుంచి చిత్రీకరణలో హీరోయిన్ కియారా అద్వానీ జాయిన్ కానున్నారు. హీరో రామ్ చరణ్ 15 వ మూవీ , శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై 50 వ మూవీ గా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ”#RC15” మూవీ అన్ని భారతీయ భాషలలో రిలీజ్ కానుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: