గోపీకృష్ణా మూవీస్ సమర్పణలో యు వి క్రియేషన్స్ , టి సిరీస్ బ్యానర్స్ పై రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , పూజాహెగ్డే జంటగా యూరోప్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన పీరియాడికల్ లవ్‌స్టోరీ “రాధేశ్యామ్ ” మూవీ 2022 సంవత్సరం జనవరి 14 వ తేదీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. ఈ మూవీ లో భాగ్య శ్రీ, మురళీ శర్మ, ప్రియదర్శి, కునాల్ రాయ్ కపూర్, కృష్ణంరాజు ముఖ్య పాత్రలలో నటించారు. “రాధేశ్యామ్ ” మూవీ హిందీ వెర్షన్‌కు మిథున్-మనన్ భరద్వాజ్, దక్షిణాది భాషలకు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా కొనసాగుతున్న పూజాహెగ్డే తెలుగు , తమిళ , హిందీ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. పూజాహెగ్డే ప్రస్తుతం “బీస్ట్ ” తమిళ మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. పూజాహెగ్డే కథానాయికగా పలు మూవీస్ చర్చల దశలో ఉన్నాయి. స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే “రాధేశ్యామ్ “మూవీ గురించి మాట్లాడుతూ.. ఈ చిత్ర కథ ప్రేక్షకులకు సరికొత్త ఎక్స్ పీరియన్స్ ను ఇస్తుందనీ , తాను ఇప్పటి వరకూ పలు ప్రేమ కథలలో నటించాననీ , “రాధేశ్యామ్” మూవీ అన్నింటి కంటే ప్రత్యేకం అనీ,ప్రేక్షకులు ఒక అద్బుతమైన ప్రేమ కథను చూడబోతున్నారనీ , ప్రేక్షకులు ఈ సినిమా ను ఖచ్చితంగా ఆస్వాదిస్తారనే నమ్మకం ఉందంటూ కామెంట్స్ చేశారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: