శ్రీ కీర్తి క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రవితేజ హీరోగా రూపొందిన “విక్రమార్కుడు ” మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. అనుష్క కథానాయిక. కీరవాణి సంగీతం అందించారు. విక్రమ్ రాథోడ్ , అత్తిలి సత్తిబాబు గా ద్విపాత్రాభినయం చేసి రవితేజ ప్రేక్షకులను అలరించారు. అత్తిలి సత్తిబాబు గా రవితేజ కామెడీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు “విక్రమార్కుడు ” మూవీ సీక్వెల్ తెరకెక్కనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
“విక్రమార్కుడు ” మూవీ సీక్వెల్ కు హీరో రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ సీక్వెల్ స్క్రిప్ట్ వర్క్ ను కంప్లీట్ చేశారు. ఈ సీక్వెల్ పై దర్శకుడు రాజమౌళి ఆసక్తి చూపకపోవడంతో రైటర్ విజయేంద్ర ప్రసాద్ దర్శకుడు సంపత్ నంది ని సంప్రదించగా ఆయన సీక్వెల్ మూవీ ని తెరకెక్కించడానికి సుముఖంగా ఉన్నారు. సంపత్ నంది, రవితేజ కాంబినేషన్ లో రూపొందిన “బెంగాల్ టైగర్ ” మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మూవీ పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: