శింబు వెంకట్ ప్రభు డైరెక్షన్లో ‘మానాడు’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పవర్ ఫుల్ పొలిటికల్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈసినిమాను తెలుగులో ‘రీవైన్డ్’ అనే టైటిల్ తో రిలీజ్ చేయనున్నారు. ఇక ఈసినిమా ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టింది. మరోవైపు ఇప్పటికే ఈ సినిమా నుండి పలు పోస్టర్లు అలాగే టీజర్ ను రిలీజ్ చేయగా వాటికి సూపర్ రెస్పాన్స్ రావడంతో ఈసినిమాపై అంచనాలు బాగానే పెరిగాయి. ఇక దీపావళికే ఈసినిమాను రిలీజ్ చేయనున్నట్టు ఇప్పటికే చిత్రయూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టారు. దీనిలో భాగంగానే ఈసినిమా నుండి ట్రైలర్ రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. అక్టోబర్ 2న ఈసినిమా ట్రైలర్ రిలీజ్ చేయనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
#MaanaaduTrailer from October 2nd 🙏🏻😊#Maanaadu pic.twitter.com/C8ASQ6dQkC
— Silambarasan TR (@SilambarasanTR_) September 27, 2021
కాగా ఈ సినిమాలో శింబుకు జోడిగా కళ్యాణీ ప్రియదర్శన్ నటిస్తుండగా ఎస్‌ఏ చంద్రశేఖర్, భారతీరాజా, ప్రేమ్‌జీ అమరన్, కరుణాకరన్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భారీ బడ్జెట్ తో హిందీ, తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో సురేష్ కామాక్షి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: