కరోనా సెకండ్ వేవ్ తరువాత వచ్చిన సినిమాల్లో లవ్ స్టోరీసినిమా ఇండస్ట్రీకి కాస్త ఊరటనిచ్చింది అని చెప్పొచ్చు. ఈసినిమా రిజల్ట్ కోసం అందరూ ఎదురుచూస్తున్న తరుణంలో మంచి హిట్ టాక్ తెచ్చుకొని.. సాలిడ్ కలెక్షన్స్ ను సొంతం చేసుకొని దూసుకుపోతుంది. దీంతో ముందు ముందు రిలీజ్ కాబోయే సినిమాలకు మంచి బూస్టప్ ఇచ్చినట్టైంది. ఇక ఈసినిమా మంచి విజయం దక్కించుకోవడంతో సక్సెస్ మీట్ కూడా ఏర్పాటు చేసింది చిత్రయూనిట్. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాగార్జున కాస్త భావోద్వేగానికి గురయ్యారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
‘లవ్ స్టోరీ` లో నాగచైతన్యను చూస్తుంటే కడుపు నిండిపోతోందని ఆనందాన్ని వ్యక్తం చేశారు. యాక్టర్ అండ్ స్టార్ ఇవి రెండు డిఫరెంట్ పదాలు. చైతుని ఒక స్టార్ యాక్టర్ గా చూపించావు.. కొత్త జర్నీని అందించావు. నాన్నా నువ్వు ఫెంటాస్టిక్.. సినిమా చూస్తూ నేను నవ్వేలా.. ఏడ్చేలా చేశావ్ అంటూ తనయుడి సక్సెస్ ను చూసి సంతోషం వ్యక్తం చేశారు. ఇక సినిమాను శేఖర్ కమ్ముల చాలా అద్భుతంగా తెరకెక్కించాడని.. సినిమాల కోసం పెద్ద పెద్ద లొకేషన్స్ అవసరం లేదు కేవలం టెర్రస్ చాలని చూపించాడు. సినిమాలోని ప్రతి సన్నివేశం బ్యూటిఫుల్ గా వుంది.. సినిమా చూశాక రెండు మూడు రోజులు అదే భావోద్వేగాలకు లోనయ్యాను.. సాయి పల్లవి ఓ అద్భుతమైన నటి.. తను ఏ క్యారెక్టర్ చేసినా ఓ మ్యాజిక్ వుంటుందని.. ఆమెకది ఓ వరం అని చెప్పుకొచ్చారు.
మరి నాగ చైతన్య వరుసగా విజయాలతో దూసుకుపోతున్నాడు. ఇప్పుడు ఫోకస్ మొత్తం అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ పైనే ఉంది. నాగ్ కూడా అఖిల్ కు మంచి హిట్ ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్నాడు. చూద్దాం మరి మూడు సినిమాలు వరుసగా పరాజయం అయిన అఖిల్ కు ఈ సినిమా అయినా మంచి సక్సెస్ ఇస్తుందేమో.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: