ఎప్పటినుండో ఎదురుచూస్తున్న బిగ్ బాస్ సీజన్ 5 స్టార్ట్ అయిపోయింది. ఇక ఇంట్లో ఉండి స్మాల్ స్క్రీన్ పై ఈషో చూడటానికి బాగానే ఉంటుంది కానీ.. ఆ హౌస్ లో ఉండే వాళ్లకి తెలుస్తుంది ఎంత ప్రెజర్ ఉంటుందో. తమ వ్యక్తిత్వాన్ని చూపిస్తూ.. నేచురల్ గా ఉంటూ.. కాస్త ఎమోషన్స్ ను కంట్రోల్ చేసుకోగలిగితేనే ఈ హౌస్ లో ఉండగలగుతారు. అయితే ఒక్కో కంటెస్టెంట్ ఒక్కోలా ఉంటారు కాబట్టి కొంతమంది హౌస్ నుండి ముందు వెళిపోతారు.. కొంతమంది ఫైనల్ వరకూ ఉంటారు. చివరికి టైటిల్ గెలిచేది ఒక్కరే. అలా ఈసారి హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ లో ఫైనల్ వరకూ వెళ్లే అవకాశం ఎక్కువగా ఉన్న కంటెస్టెంట్ రవికి ఉందని చెప్పొచ్చు. కానీ ప్రస్తుతం హౌస్ లో ఉన్న కొంతమంది రవి ని టార్గెట్ చేస్తుంటే ఇప్పుడు బిగ్ బాస్ కూడా టార్గెట్ చేస్తున్నాడేమో అనిపిస్తుంది. అసలు సంగతేంటంటే..
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
గత వారం సిరి-సన్నీ గొడవ ఎంత రచ్చ అయి.. ప్రేక్షకులు సిరిని ఏ రేంజ్ లో ఏసుకున్నారో చూశాం. ఇక ఈవారం ఎలిమినేషన్ ప్రాసెస్ లో ప్రియా-లహరి మధ్య వివాదం ఎంత హైలెట్ అయిందో చూస్తూనే ఉన్నాం. అయితే ఇక్కడి వరకూ బాగానే ఉంది కానీ వీరిద్దరి మధ్యలోకి రవిని తీసుకొచ్చి రవిని బుక్ చేసింది ప్రియ. నిజానికి బిగ్ బాస్ హౌస్ లో 24 గంటలు వాళ్లేం చేస్తారో చూపించరు. కేవలం ఒక గంట మాత్రమే.. అది కూడా ఏది చూపిస్తే ప్రేక్షకులు ఎంటర్ టైన్ అవుతారో అది మాత్రమే కట్ చేసి చూపిస్తారు. ఒక ఇన్సిడెంట్ ముందు ఏం జరిగింది.. తరువాత ఏం జరిగింది అనే ఎనాలసిన్ చేసుకునే వాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు. ఇప్పుడు రవి విషయంలో జరిగింది కూడా అదే. నామి నేషన్ లో ప్రియా లహరిపై పలు అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి ఆ తరువాత రవి అంటేనే నేను అన్నాను అని చెప్పే సరికి రవి ఫోకస్ లోకి వచ్చాడు. ప్రియా ఎస్కేప్ అయింది. అసలు జరిగింది మాత్రం.. అప్పటికే వారం రోజుల ముందు నుండే రవితో ప్రియా లహరి గురించి డిస్కస్ చేస్తున్నట్టు మనకు చూపించింది లేదు. నిజానికి ముందు నుండే రవిని ప్రియా లహరి విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండమని చెపుతున్నట్టు మనకు రవి ఒక సందర్భంలో చెబుతుంటే చూశాం. కానీ అవేమీ చూపించకుండా కేవలం రవిని మాత్రమే టార్గెట్ చేస్తున్నట్టు బిగ్ బాస్ వారిద్దరూ మాట్లాడుకున్న క్లిప్ చూపించడం కూడా తప్పే. ఏదో ఒక్క రోజులో అయిపోయే ప్రోగ్రాం అయితే అనుకోవచ్చు కానీ ఇంకా హౌస్ లో రెండు మూడు నెలలు ఉండాలి. అలాంటప్పుడు ఇలాంటి విషయాలు కంటెస్టెంట్స్ పై చాలా ప్రభావం చూపిస్తాయి. ఇప్పుడు ఈ రీజన్ వల్ల రవిని కార్నర్ చేయడంతో పాటు.. రవి గేమ్ పై కూడా ఎఫెక్ట్ పడుతుంది. రవిని ఎవరూ నమ్మలేని పరిస్థితి వస్తుంది. మరి హగ్ అనే విషయాన్ని అంత రచ్చ చేసి హౌస్ లో ఉన్న వాళ్లు హగ్ చేసుకోవాలంటే భయపడేట్టు చేసిన ప్రియను వదిలేసి రవిని టార్గెట్ చేయడం బిగ్ బాస్ స్ట్రాటజీలో భాగమని అనుకోవాలేమో..
ఏది ఏమైనా ఇప్పుడున్న కంటెస్టెంట్స్ లో రవి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అండ్ బెస్ట్ కంటెస్టెంట్. హౌస్ లో ఎంటర్ టైన్ చేసే వాళ్లలో రవి కూడా మెయిన్ పిల్లర్. ఇలాంటి చిన్న చిన్న వివాదాలు రవి గ్రాఫ్ ను అయితే తగ్గిస్తాయి అని చెప్పలేం. ఇలాంటి అవరోధాలు ఎన్ని ఎదురైనా ధైర్యంగా నిలబడి రవి విన్నర్ అవ్వాలని కోరుకుందాం..
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: