మరో ప్రేమకథ సిద్ధం చేస్తున్న శివ నిర్వాణ

Director Shiva Nirvana Starts Script Work Of A Love Entertainer Once Again,Shiva Nirvana Penning A Love Story For His Next,I'm Penning Yet Another Love Story Says Shiva Nirvana,Shiva Nirvana Penning A Love Story For His Next Movie,Director Shiva Nirvana Is Now Back To Writing A Script,Director Shiva Nirvana,Shiva Nirvana,Director Shiva Nirvana,Shiva Nirvana Movies,Shiva Nirvana New Movie,Shiva Nirvana Latest Movie,Shiva Nirvana Upcoming Movie,Shiva Nirvana New Movie Update,Shiva Nirvana Latest Movie Udpate,Shiva Nirvana Latest Film Updates,Shiva Nirvana Movie Update,Shiva Nirvana Movie News,Shiva Nirvana Upcoming Movies,Shiva Nirvana New Project,Shiva Nirvana Upcoming Project,Shiva Nirvana Next Film,Shiva Nirvana Next Movie,Shiva Nirvana Next Project,Shiva Nirvana Latest News,Shiva Nirvana News,Shiva Nirvana Movie Updates,Shiva Nirvana Movie News,Shiva Nirvana Latest Movie News,Shiva Nirvana New Movie Detials,Shiva Nirvana Upcoming Movie Details,Shiva Nirvana Next Project Detials On Cards,Shiva Nirvana Latest Movie Details On Cards,Shiva Nirvana Latest Film Update,Shiva Nirvana Starts Script Work Of A Love Entertainer Once Again,Shiva Nirvana Starts Script Work Of A Love Entertainer,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest 2021 Telugu Movie Updates,Latest 2021 Telugu Movies,Shiva Nirvana Love Entertainer Movie,#ShivaNirvana

ఇండస్ట్రీకి ఎంతో మంది దర్శకులు వస్తుంటారు.. పోతుంటారు. కానీ కొంతమంది మాత్రమే తమ మార్క్ ను చూపించి సక్సెస్ అవ్వగలుగుతారు. ఇక అలా వచ్చి మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ శివ నిర్వాణ. శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన మొదటి సినిమా నిన్నుకోరి. నాని హీరోగా వచ్చిన ఈసినిమా మంచి ఎమోషనల్ లవ్ స్టోరీ కావడంతో హిట్ అందుకుంది. ఆ తరువాత నాగచైతన్యతో చేసిన మజిలీ సినిమా కూడా సూపర్ హిట్ అవ్వడంతో నిర్వాణ టాప్ డైరెక్టర్ ప్లేస్ లోకి వెళ్లిపోయాడు. ‘నిన్నుకోరి’, ‘మజిలీ’ చిత్రాలలో చక్కటి ప్రేమకథను చూపించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక రీసెంట్ గా నాని హీరోగా టక్ జగదీష్ సినిమా తెరకెక్కించగా అది ఇటీవలే ఓటీటీలో రిలీజ్ అయింది. అయితే ఈసినిమా మిశ్రమ స్పందన దక్కించుకుంది. ఇక ఇప్పుడు వెంటనే మరో ప్రేమకథను సైతం రాయడానికి సిద్దమైపోయాడు. ఈవిషయాన్ని శివ నిర్వాణ స్వయంగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఒక వీడియో పోస్ట్ చేస్తూ తెలిపాడు. వైజాగ్ బీచ్ నుండి ఆయనో 40 సెకన్ల చిన్న వీడియోను షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియోలో ‘నిన్ను కోరి, మజిలి’ చిత్రాలను ప్రేక్షకులు మనసుల్లోకి తీసుకున్నారని, ఆ స్ఫూర్తితో తాజాగా నాలుగో చిత్రంగా మరో ప్రేమకథను అందించబోతున్నానని.. సముద్రం, కెరటాలు ఎంత ఒరిజినల్ గా ఉంటాయో… తన కొత్త సినిమా కథ కూడా అంతే ఒరిజినల్ గా ఉంటుందని తెలిపాడు.

మరి తన తరువాత సినిమా విజయ్ దేవరకొండతో ఉండబోతుందని ఎప్పటి నుండో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. మరి విజయ్ దేవరకొండతోనే ఈ ప్రేమ కథను చేస్తాడా.. లేక వేరే హీరోతో ఉంటుందా అన్న విషయాలు తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 + 13 =