మెగా హీరో వైష్ణవ్ తేజ్ మొదటి సినిమా ‘ఉప్పెన’ తోనే నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతేకాదు తన తరువాత సినిమాలను కూడా చాలా జాగ్రత్తగా సెలక్ట్ చేసుకుంటున్నాడు. ఈనేపథ్యంలోనే క్రిష్ దర్శకత్వంలో కొండపొలం సినిమా చేస్తున్నాడు. ఇక ఈసినిమా ఎలా ఉంటుందో అన్న విషయం ఇప్పటికే పోస్టర్లు, టీజర్ చూస్తే అర్థవుతుంది కదా. మరోసారి డిఫరెంట్ కథతో వస్తున్నాడు. ఇక కరోనా సెకండ్ వేవ్ ఉన్నా కానీ క్రిష్ చాలా తక్కువ టైమ్ లోనే ఈ సినిమా షూటింగ్ ముగించేశాడు. అయితే రిలీజ్ మాత్రం లేట్ అయింది. ఈనేపథ్యంలోనే రీసెంట్ గానే రిలీజ్ డేట్ ను ప్రకటించారు. దసరా కానుకగా అక్టోబర్ 8న విడుదల కాబోతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఈసినిమా నుండి ట్రైలర్ ను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. సెప్టెంబర్ 27న సాయంత్రం 3 గంటల 33 నిమిషాలకు ట్రైలర్ ను రిలీజ్ చేస్తున్నట్టు తెలిపింది చిత్రయూనిట్.
Get Ready for @panja_vaishnav_tej @Rakulpreet #KondaPolam “An Epic Tale of Becoming”
Releasing #KondaPolamTrailer on Monday (27 Sep) 3:33 PM#KondaPolamOct8 🎊@mmkeeravaani @gnanashekarvs #Sannapureddy @YRajeevReddy1 #JSaiBabu @FirstFrame_ent @MangoMusicLabel pic.twitter.com/7oKm7TYClw
— Krish Jagarlamudi (@DirKrish) September 25, 2021
అయితే ఇదిలా ఉండగా ఈసినిమా రిలీజ్ విషయంలో కూడా ఈమధ్య వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. విడుదల తేదీ దగ్గర పడుతున్నా ఇంకా ఈ సినిమా ప్రమోషన్స్ ప్రారంభించకపోవడంతో ‘కొండపొలం’ చిత్రం వాయిదా పడిందంటూ వార్తలు వచ్చాయి. చెప్పిన డేట్ కే సినిమా రిలీజ్ అవుతుందని వార్తలపై కూడా మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.
కాగా ఈసినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది. ఓబులమ్మ అనే పాత్రలో డీ గ్లామర్ రోల్ చేస్తుంది రకుల్. ఇక ఈ చిత్రాన్ని ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: