టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ ఈమధ్యే ఊరుపేరు భైరవకోన సినిమాతో డీసెంట్ హిట్ ను అందుకున్నాడు. క్రియేటివ్ డైరెక్టర్ విఐ ఆనంద్ దర్శకత్వంలో ఎకె ఎంటర్టైన్మెంట్స్లో ఈసినిమా వచ్చింది. అయితే ఊరుపేరు బైరవకోన సినిమా రిలీజ్ కాకముందే ఇదే బ్యానర్ లో సందీప్ కిషన్ మరో సినిమాను కూడా ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. సివి కుమార్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈసినిమాను రూపొందిస్తున్నారు. మాయ వన్ అనే టైటిల్ తే ఈసినిమా రానుంది. సూపర్ విలన్‌తో ఒక సామాన్యుడి ఘర్షణ కథగా ఈసినిమా ఉండబోతుంది
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. అయితే తాజాగా ఈసినిమా నుండి క్రేజీ అప్ డేట్ తో వచ్చారు మేకర్స్. ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. టీజర్ అయితే థ్రిల్లింగ్ గా ఉండి ఆకట్టుకుంటుంది.
కాగా ఈసినిమాలో ఆకాంక్ష రంజన్ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఎకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర ఈసినిమాను నిర్మిస్తున్నారు. కార్తీక్ కె తిల్లై సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. సెన్సేషనల్ కంపోజర్ సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్డ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: