‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ డేట్ ఇప్పుడే చెప్పలేం..!

RRR Movie Team Says They Cant Think Of New Release Date As Of Now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Update,Telugu Movies Updates,Jr NTR,Ram Charan,Rajamouli,RRR,RRR Movie,RRR Telugu Movie,RRR Movie Release Date Postponed,RRR Telugu Movie Release Date Changed,RRR Movie Latest Updates,RRR Telugu Movie Gets New Release Date

ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ కథానాయకులుగా రూపొందుతున్న భారీ మల్టీస్టారర్‌ ‘ఆర్ఆర్ఆర్’’. ఇక ఈసినిమా ఇటీవలే చివరి షెడ్యూల్ ను “ఉక్రెయిన్”లో పూర్తి చేసుకుంది. అయితే అక్కడక్కడ కొంత ప్యాచ్ వర్క్ మాత్రం మిగిలిఉన్నట్టు తెలుస్తుంది. ఇక ఇదిలా ఉండగా సినిమా ప్రారంభం అప్పుడు ఏలాగైతే రాజమౌళి ప్రెస్ మీట్ పెట్టాడో..అలాగే ఉక్రెయిన్ నుండి హైదరాబాద్ వచ్చిన వెంటనే ప్రెస్ మీట్ పెడతారని.. అంతేకాకుండా ఎంతోకాలంగా రిలీజ్ డేట్ విషయంలో ఉన్న కన్ప్యూజన్ కు క్లారిటీ ఇస్తారని వార్తలు వచ్చాయి. కానీ రాజమౌళి చాలా సైలెంట్ గా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ మొదలుపెట్టేశాడు. దీంతో మరోసారి రిలీజ్ డేట్ పై అనుమానాలు మొదలయ్యాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయితే తాజా సమాచారం ప్రకారం “ఆర్ఆర్ఆర్” రిలీజ్ డేట్ ను స్పష్టం చేసింది చిత్రయూనిట్. దాదాపు ఆక్టోబర్ రిలీజ్ ఆగిపోయినట్టే అన్న విషయంలో క్లారిటీ వచ్చేసింది . ఎందుకంటే రెండు నెలల్లో పోస్ట్ ప్రొడక్షన్ పనులంటే కష్టమే. ఈనేపథ్యంలోనే ఆర్ఆర్ఆర్ టీమ్ తమ ట్విట్టర్ లో.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు అయ్యేసరికి చాలా టైమ్ పడుతుంది.. అక్టోబర్ 21 వరకూ పోస్ట్ ప్రొడక్షన్ పనులు సరిపోతాయి.. అందుకే ప్రస్తుతానికి రిలీజ్ డేట్ ను వాయిదా వేస్తున్నామని తెలిపారు. అంతేకాదు రిలీజ్ డేట్ ఇప్పుడే చెప్పలేం.. ప్రపంచ వ్యాప్తంగా వరల్డ్ సినిమా మార్కెట్ కాస్త సాధారణ పరిస్థితికి వచ్చిన తరువాతే రిలీజ్ డేట్ ను ప్రకటిస్తాం అని తెలిపారు. మరోవైపు 2022 జనవరి 8నే ఫైనల్ రిలీజ్ డేట్ గా మేకర్స్ ఫిక్స్ చేశారన్న వార్తలు కూడా వస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజం తెలియాలంటే అధికారికం ప్రకటన వచ్చేంత వరకూ ఆగాల్సిందే..

కాగా  స్వాతంత్య్ర సమరయోధులు కొమరం భీమ్‌, అల్లూరి సీతారామరాజు పాత్రల ఆధారంగా ఫిక్షన్ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తుండగా.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ‘ఒలివియా మోరిస్’ నటిస్తుంది. ఇక ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, ఆలిసన్ డూడి కూడా నటిస్తున్నారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here