పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్‌డేని పురస్కరించుకొని అభిమానులు పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేపట్టారు. అభిమానులతో పాటు పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు పవన్‌కి ప్రత్యేక శుభాకాంక్షలు అందించారు. ఈ నేపథ్యం లో పవన్ కళ్యాణ్ తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తన చుట్టూ ఉన్న సమాజం ఎల్లవేళలా క్షేమంగా ఉండాలనే భగవంతుణ్ణి ప్రార్థిస్తుంటాననీ, .యేడాదిన్నర కాలంగా దేశం కరోనా మహమ్మారితో పోరాడుతూనే ఉందనీ ,ఇలాంటి క్లిష్ట సమయంలో జన్మదిన శుభాకాంక్షలు అందుకోలేను అనే ఉద్దేశంతో దైవ చింతనలో గడిపాననీ , అపార ప్రేమాభిమానాలతో మిత్రులు , శ్రేయోభిలాషులు, సమాజ సేవకులు, రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు సామాజిక మాధ్యమాల ద్వారా శుభాకాంక్షలు అందచేశారనీ , అభిమానులు సామాజిక సేవ కార్యక్రమాలు చేపట్టి తమ అభిమానాన్ని సేవామార్గంలో వెల్లడించారనీ , పెద్దలు శుభాశీస్సులు అందించారనీ , . ప్రతి ఒక్కరూ ఎంతో వాత్సల్యంతో తనకు శుభాకాంక్షలు అందించారనీ , వెల కట్టలేని ఈ అభిమానానికి, వాత్సల్యానికి నేను సర్వదా కృతజ్ఞుడిననీ , అందరికీ పేరుపేరునా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియచేస్తున్నాననీ పవన్ కళ్యాణ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: