పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా వరుస అప్ డేట్స్ తో అభిమానులకు ఫుల్ ట్రీట్ ఇస్తున్నారు మేకర్స్. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా నాలుగు సినిమాల అప్‌డేట్స్ వచ్చాయి. ‘భీమ్లా నాయక్’, ‘హరి హర వీర మల్లు’, సురేందర్ రెడ్డి సినిమాల అప్ డేట్లు ఇప్పటికే రాగా.. ఇప్పుడు హరీష్ శంకర్ సినిమా అప్ డేట్ కూడా వచ్చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక పవన్ పుట్టినరోజు సందర్భంగా పవన్ కు విషెస్ చెబుతూ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో ‘జాతర షురూ.. మళ్లీ ఫుల్లీ లోడింగ్’.. అంటూ బైక్‌పై స్టైలిష్‌గా కూర్చుని ఉన్న పవన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. పవన్ ను సగం చూపిస్తూ డిజైన్ చేసిన ఈ పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఇక మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్స్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఈసినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.
JAATHARA SHURU 🤙🏽
Wishing our dearest @PawanKalyan garu a Blockbuster Birthday ❤️
– Team #PawanKalyan28 @harish2you @ThisIsDSP @DoP_Bose #AnandSai @venupro pic.twitter.com/EiDr6Th6me
— Mythri Movie Makers (@MythriOfficial) September 2, 2021
ఇక వీరిద్దరి కాంబినేషన్ లో ఇప్పటికే ‘గబ్బర్ సింగ్’ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా ఏ రేంజ్ లో సక్సెస్ సాధించిందో కూడా తెలుసు. ఈనేపథ్యంలో వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి ఈసినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. మరి చూద్దాం ఈసారి ఈసినిమా ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: