రీఎంట్రీ తరువాత పవర్ స్టార్ వరుస సినిమాలను లైన్ లో పెట్టిన సంగతి తెలిసిందే కదా. ఈఏడాది వకీల్ సాబ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పవన్ లిస్ట్ లో ప్రస్తుతం నాలుగు సినిమాలు ఉన్నాయి. అందులో సురేందర్ రెడ్డితో వస్తున్న సినిమా కూడా ఒకటి. సురేందర్ రెడ్డి, పవన్ కాంబోలో మూవీ రూపొందనున్న విషయం తెలిసిందే. తాజాగా పవన్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా నుండి కూడా అప్డేట్ ఇచ్చారు మేకర్స్. సురేందర్ సినిమాకు సంబంధించిన పోస్టర్ ను విడుదల చేశారు. ఈ పోస్టర్ లో “యథా కాలమ్ తథా వ్యవహారమ్…” అంటూ ఒక గన్ ను, హైదరాబాద్ లోని చార్మినార్, సైబర్ టవర్ ను చూపించడం ఆసక్తికరంగా ఉంది. ఈ పోస్టర్ ను చూస్తుంటే యాక్షన్ డ్రామా గా ఈసినిమా రూపొందుతున్నట్టు అర్థమవుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
Presenting to you all our proud association with @PawanKalyan Gaaru for the prestigious #ProductionNo9 💥 @SRTmovies @itsRamTalluri @DirSurender @VamsiVakkantham#HBDJanaSenaniPawanKalyan pic.twitter.com/c1Hgm7tr8n
— SRT Entertainments (@SRTmovies) September 2, 2021
కాగా రామ్ తాళ్లూరి నిర్మాతగా ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లో ఈసినిమా తెరకెక్కుతుంది. ఇక ఈసినిమాలో నటించే హీరోయిన్.. ఈసినిమాకు సంబంధించిన వివరాలను త్వరలోనే తెలియచేయనున్నారు.
ఇక ఈరోజు పవన్ పుట్టినరోజు సందర్భంగా భీమ్లా నాయక్ సినిమా నుంచి టైటిల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. మరోవైపు “హరి హర వీరమల్లు” నుంచి రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించారు. 2022 ఏప్రిల్ 29న విడుదల చేయనున్నారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: