అక్కినేని వారసత్వంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నాగ చైతన్య తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు విభిన్నమైన సినిమాలు చేస్తూ కెరీర్ లో దూసుకుపోతుంది. ప్రస్తుతం ఆయన వరుస సినిమాలతో బిజీగా ఉండగా.. అందులో విక్రమ్ కుమార్ దర్శకత్వంలో వస్తున్న ‘థాంక్యూ’ సినిమా ఒకటి. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఇదిలా ఉండగా ఈసినిమాలో నాగచైతన్య పాత్ర గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వినిపిస్తుంది. ఈసినిమాలో చైతన్య మూడు విభిన్నమైన పాత్రల్లో నటిస్తున్నాడన్న టాక్ బలంగా వినిపిస్తోంది. అంటే మూడు మూడు విభిన్నమైన వయస్సులో ఆయన్ని దర్శకుడు చూపించనున్నాడట. ఈ వార్త అయితే ఇప్పుడు బలంగా వినిపిస్తుంది. ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే కొన్నిరోజులు వెయిట్ చేయాల్సిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈసినిమాలో రాశీఖన్నా హీరోయిన్ గా నటిస్తుంది. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ మూవీని నిర్మిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు. పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. మరి ‘మనం’ వంటి క్లాసిక్ తెరకెక్కించిన విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాగ చైతన్య మరోసారి నటిస్తున్నాడు. మరి ఈ సినిమాతో మరో హిట్ కొడతారేమో చూద్దాం..
ఇక దీనితో పాటు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా వస్తున్న సినిమా ‘లవ్ స్టోరీ’. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈసినిమా.. కరోనా సెకండ్ వేవ్ వల్ల పోస్ట్ పోన్ అయింది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్, అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్స్ పై నిర్మిస్తున్న ఈ సినిమాలో ఇంకా రాజీవ్ కనకాల, ఈశ్వరీరావు, దేవయాని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. పవన్ సంగీతం అందిస్తున్నాడు. ఇంకా బాలీవుడ్ లో కూడా చేస్తున్నాడు. అమీర్ ఖాన్ హీరోగా వస్తున్న లాల్ సింగ్ చద్దా సినిమాలో ఒక కీలక పాత్రలో నాగ చైతన్య నటిస్తున్నాడు.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: