అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం పుష్ప. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో లారీ డ్రైవర్ పుష్ప రాజ్ గా అల్లు అర్జున్ కనిపించబోతున్నాడు. ఇక ఈసినిమా రెండు పార్ట్ లుగా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకునే పనిలో పడింది. తాజాగా ఈసినిమా ఫైనల్ షెడ్యూల్ ను స్టార్ట్ చేసింది. ఈ సినిమాకి సంబంధించిన షూటింగు ఎక్కువగా మారేడుమిల్లి .. రంపచోడవరం అటవీప్రాంతాల్లో జరిగింది. ఆ తరువాత హైద్రాబాద్ లో కొన్ని రోజులు షూటింగ్ జరుపుకోగా ఇప్పుడు ఫైనల్ షెడ్యూల్ కోసం మళ్లీ మారేడుమల్లి వెళ్లారు చిత్రయూనిట్. ఈ షెడ్యూలో తో సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా.. ఫహద్ ఫాజిల్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. రీసెంట్ గానే ఫహద్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. సునీల్, అనసూయ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈసినిమా రెండు పార్ట్ లుగా వస్తున్న నేపథ్యంలో మొదటి భాగాన్ని ఈ ఏడాది క్రిస్మస్‌కు ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
కాగా ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మరోవైపు ఇటీవల రిలీజైన ఫస్ట్ సింగిల్ కూడా వ్యూస్ తో దూసుకుపోతుంది. మరి ఈసినిమా ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: