నితిన్ ప్రధాన పాత్రలో వస్తున్న మాస్ట్రో సినిమా రిలీజ్ కు సిద్దంగా ఉన్న సంగతి తెలిసిందే. థియేటర్స్ ఓపెన్ అయినా కూడా ఈసినిమను డైరెక్టర్ గా ఓటీటీలోనే రిలీజ్ చేస్తున్నారు. సెప్టెంబర్ 17న ఈసినిమా డిస్నీ హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. ఇక ఈ సందర్భంగా ఈసినిమా ప్రమోషన్స్ ను కూడా స్టార్ట్ చేశారు చిత్రయూనిట్. దీనిలో భాగంగానే ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్, ట్రైలర్ లను రిలీజ్ చేయగా అవి సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకొని సినిమాపై అంచనాలను అయితే పెంచేశాయి. ఇక నేడు తాాజాగా ఈసినిమా నుండి స్నీక్ పీక్ అంటూ మరో వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ వీడియోలో నితిన్ పియానో వాయిస్తుండగా.. ఆ పియానో పై ఇళయరాజా ఫొటో కనిపిస్తుంది. ఇక నితిన్ పియానో వాయిస్తుండగా అందులో ఒక కీ పని చేయడం ఆగిపోవడంతోనితిన్ ఇది మళ్ళీ రిపేర్ చేయించాలా ? అంటూ అసహనం వ్యక్తం చేస్తాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Check out the Sneak Peek of #MAESTRO‘s World🎹
▶️https://t.co/vYTI2ug8PlSet your clock! #MaestroOnHotstar from Sep17th only on @DisneyPlusHS @actor_nithiin @NabhaNatesh @GandhiMerlapaka @SreshthMovies #SudhakarReddy #NikithaReddy #rajkumarakella
— Tamannaah Bhatia (@tamannaahspeaks) August 30, 2021
కాగా ఈ సినిమాలో టబు పాత్రలో తమన్నా.. రాధికా ఆప్టే పాత్రలో నభా నటేష్ నటిస్తున్నారు. శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్‌పై ఎన్.సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక బెంగాలీ నటుడు జిషు సేన్ గుప్తా ఒక ముఖ్యమైన పాత్రను చేస్తున్నాడు. ఈ చిత్రానికి సాగర్ మహతి సంగీతం అందించనుండగా… హరి కె.వేదాంత్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేయనున్నారు.
మరి హిందీలో సూపర్ హిట్ అయిన అంధదూన్ రీమేక్ గా ఈసినిమా వస్తుంది. మరి ఇక్కడ ఎలాంటి హిట్ ను సొంతం చేసుకుంటుందో తెలియాలంటే రిలీజ్ వరకూ ఆగాల్సిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: