నిర్మాతగా ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసిన ఎమ్.ఎస్ రాజు ఇప్పుడు డైరెక్టర్ గా మారిన సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలోనే ఇప్పటికే డర్టీ హరి సినిమాతో హిట్ అందుకున్న ఎమ్ ఎస్ రాజు ఇప్పుడు మరో యూత్ ఎంటర్ టైనర్ తో వస్తున్నాడు. ఇక ఈ సినిమాను కరోనా సెకండ్ వేవ్ తరువాతే సెట్స్ పైకి తీసుకెళ్లాడు ఎమ్ ఎస్ రాజు. అయినా కూడా చాలా ఫాస్ట్ గా ఈసినిమాను కంప్లీట్ చేశారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసుకోంది. ఇక ఈవిషయాన్ని అధికారికంగా తెలియచేశారు మేకర్స్. కామెడీ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ చిత్ర విడుదల తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈసినిమాలో సుమంత్ అశ్విన్ సరసన మెహర్ చావల్ హీరోయిన్ గా నటిస్తుండగా.. వీరిద్దరితో పాటు రోహన్, కృతికా శెట్టి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాను వైల్డ్ హనీ ప్రొడక్షన్స్ లో సుమంత్ అశ్విన్, వింటేజ్ పిక్చర్స్ మరియుఏబిజి క్రియేషన్స్ బ్యానర్స్ పై రజనీకాంత్ .ఎస్ తో కలిసి సంయుక్తంగా నిర్మించనున్నారు. సుమంత్ అశ్విన్ ఈ సినిమాతో నిర్మాతగా పరిచయం కాబోతున్నాడు. ఈసినిమాకు సమర్థ్ గొల్లపూడి సంగీతం అందిస్తుండగా నాని చమిడి శెట్టి సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: