శ్రీ వెంకటేశ్వర సినిమాస్ , అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్స్ పై ఫీల్ గుడ్ చిత్ర దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య , సాయి పల్లవి జంటగా తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఆహ్లాద భరిత ప్రేమ కథా చిత్రం “లవ్ స్టోరీ” ఈ మూవీ లో దేవయాని , రావు రమేష్ , పోసాని ముఖ్య పాత్రలలో నటించారు. సిహెచ్ పవన్ సంగీతం అందించారు. హీరో నాగచైతన్య , సాయి పల్లవి ఫస్ట్ కాంబినేషన్ లో “లవ్ స్టోరీ ” మూవీ రూపొందింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“లవ్ స్టోరీ “చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , ఫస్ట్ గ్లింప్స్ , సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. “లవ్ స్టోరీ ” మూవీ టీజర్ ఆసక్తికరంగా ఉండి ప్రేక్షకులను అలరించింది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఏప్రిల్ 16న విడుదల కావాల్సిన “లవ్ స్టోరీ ” విడుదల వాయిదా వేస్తున్నట్లు చిత్రబృందం అధికారిక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన సాంగ్స్ “లవ్ స్టోరీ ” మూవీపై హైప్ ను క్రియేట్ చేశాయి. “లవ్ స్టోరీ ” మూవీ వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 10 వ తేదీ రిలీజ్ కానుంది. ప్రమోషన్స్ ప్రారంభించనున్న మేకర్స్ ట్రైలర్ తో పాటు ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ప్లాన్ చేస్తున్నారు.“లవ్ స్టోరీ ” మూవీ తెలుగుతో పాటు కన్నడ, మలయాళ భాషల్లో కూడ విడుదల కానుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: