ఇండస్ట్రీలో ఒక్కో డైరెక్టర్ కి ఒక్కో స్టైల్ ఉంటుంది. కొంతమంది డైరెక్టర్లు సినిమాలు తీయడానికి నెలలు నెలలు టైమ్ తీసుకుంటే.. కొంతమంది మాత్రం చాాలా తక్కువ టైంలోనే సినిమాను కంప్లీట్ చేస్తారు. ఇక ఇప్పుడు గుణశేఖర్ కూడా మొత్తానికి అనుకున్న టైమ్ కే శాకుంతలం సినిమా షూటింగ్ ను కంప్లీట్ చేశాడు. నిజానికి ఇది పౌరాణిక నేపథ్యంలో వస్తున్న సినిమా కాబట్టి కాస్త ఎక్కువ టైమే పడుతుంది అని అందరూ అభిప్రాయ పడ్డారు. అందులోనూ కరోనా ప్రభావం కాస్త తగ్గినప్పటికీ పూర్తి స్థాయిలో అయితే పోలేదు. అయినా కూడా అన్ని జాగ్రత్తలు తీసుకొని సినిమాను కంప్లీట్ చేశాడు. తుది షెడ్యూల్ హైదరాబాద్‌లో పూర్తయ్యింది. ఇక త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా మొదలుపెట్టనున్నారట. ఈసినిమాలో విజువల్స్, గ్రాఫిక్సే ముఖ్యం కాబట్టి పోస్ట్ ప్రొడక్షన్ పనులకు కాస్త టైమ్ ఎక్కువగానే పడుతుంది అంటున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈసినిమాలో సమంత ప్రధాన పాత్ర పోషిస్తుండగా, దేవ్ మోహన్ దుష్యంత్‌గా, అదితి బాలన్ అనసూయగా గా, మోహన్ బాబు మహర్షి, అల్లు అర్హ ప్రిన్స్ భరత్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాను గుణశేఖర్ తన స్వంత బ్యానర్ గుణ టీమ్ వర్క్స్ పతాకంపై నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. 2022 ప్రధమార్థంలో ఈసినిమాను రిలీజ్ చేయాలని చూస్తున్నారు.



[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: