క్రైమ్ థ్రిల్లర్ “వలయం “మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయిన లక్ష్ చదలవాడ మరో మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు. చదలవాడ బ్రదర్స్ సమర్పణలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిల్మ్స్ బ్యానర్ పై ఇషాన్ సూర్య దర్శకత్వంలో లక్ష్ చదలవాడ హీరోగా యాక్షన్ డ్రామా “గ్యాంగ్ స్టర్ గంగ రాజు ” మూవీ తెరకెక్కుతుంది.ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ కి పద్మావతి చదలవాడ నిర్మాత. వేదిక దత్ కథానాయిక కాగా వెన్నెలకిశోర్, చరణ్‌దీప్, శ్రీకాంత్ అయ్యంగార్, గోపరాజు రమణ, నిహార్ కపూర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మంగళవారం “గ్యాంగ్ స్టర్ గంగ రాజు ” మూవీ ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఆ ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుని మూవీ పై ఆసక్తి ని కలిగించింది. ఈ మూవీ కి సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్నారు. తొలి సాంగ్ ను వినాయక చవితి సందర్భంగా విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: