స్వరూప్ ఆర్ఎస్ జె దర్శకత్వంలో తెరకెక్కిన ”ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ” మూవీతో నవీన్ పోలిశెట్టి హీరోగా టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. ”ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ”చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్ దగ్గర భారీ సక్సెస్ అందుకుంది. హీరో నవీన్ తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుని , బెస్ట్ యాక్టర్ గా దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ అందుకున్నారు. నవీన్ హీరోగా రూపొందిన “జాతిరత్నాలు “మూవీ ఘనవిజయం సాధించడంతో టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోగా మారారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
నవీన్ పోలిశెట్టి ప్రస్తుతం “జాతిరత్నాలు “మూవీ సీక్వెల్ , స్టార్ హీరోయిన్ అనుష్క తో ఒక మూవీ కి కమిట్ అయిన విషయం తెలిసిందే. హీరో నవీన్ ఇప్పుడు సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో ఒక కామెడీ ఎంటర్ టైనర్ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. త్వరలోనే ఈ మూవీ కి సంబంధించిన వివరాలు వెల్లడి కానున్నాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: