నాగ్- చై ‘బంగార్రాజు’ గ్రాండ్ లాంఛ్

Akkineni Nagarjuna and Naga Chaitanya Starrer Bangarraju Movie Launched Today,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,2021 Latest Telugu Movie Updates,Nagarjuna,Akkineni Nagarjuna,Nagarjuna Movies,Nagarjuna New Movie,Nagarjuna Latest Movie,Nagarjuna New Movie Launch,Nagarjuna New Movie Opening,Nagarjuna Upcoming Movie,Nagarjuna Bangarraju,Nagarjuna Bangarraju Movie,Nagarjuna Bangarraju Movie Officially Launched,Nagarjuna Bangarraju Movie Launched,Bangarraju Officially Launched,Bangarraju Movie Launched,Naga Chaitanya,Naga Chaitanya Movies,Naga Chaitanya New Movie,Naga Chaitanya Bangarraju,Naga Chaitanya Bangarraju Movie Launched,Nagarjuna And Naga Chaitanya Movie,Nagarjuna And Naga Chaitanya New Movie Opening,Nagarjuna And Naga Chaitanya New Movie Launch,Soggade Chinni Nayana,Soggade Chinni Nayana Movie Sequel,Nagarjuna Bangarraju Movie Pooja Ceremony,Nagarjuna New Movie Bangarraju Movie Pooja Ceremony,Nagarjuna Akkineni Next Launched,Akkineni Nagarjuna And Naga Chaitanya Bangarraju Officially Launched,Nagarjuna Bangarraju Movie Update,Bangarraju Movie Updates,Bangarraju Latest Updates,Bangarraju,Bangarraju Movie,Bangarraju Telugu Movie,Bangarraju 2021 Latest Telugu Movie,Nagarjuna Bangarraju Movie Latest Update,Bangarraju Movie Opening,Krithi Shetty,Ramya Krishna,Bangarraju Muhurtham,Bangarraju Muhurtham Ceremony,#Bangarraju

ఫైనల్లీ ఇన్ని రోజులకు బంగార్రాజు పట్టాలెక్కాడు. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో  నాగార్జున హీరోగా 2016 లో వచ్చిన ‘సోగ్గాడే చిన్ని నాయన’ సినిమా ఎంత హిట్ అయిందో తెలిసందే కదా. ఇక ఈసినిమాకు సీక్వెల్ గా బంగార్రాజు సినిమా వస్తున్నట్టు అప్పుడే ప్రకటించారు. ఈ గ్యాప్ లో నాగార్జున పలు సినిమాలు కూడా చేశాడు కానీ ఈసినిమా మాత్రం సెట్స్ పైకి వెళ్లలేదు. దానికి తోడు కరోనా కూడా రావడంతో మరింత ఆలస్యం అయింది. ఇక ఫైనల్ గా ఇన్నేళ్లకు ఈసినిమా లాంఛింగ్ కు ముహూర్తం కుదిరింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక నేడు ఈసినిమాను లాంఛనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో నాగార్జున, నాగ చైతన్య, దర్శకుడు కళ్యాణ్ కృష్ణ, సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ తదితరులు పాల్గొన్నారు. అంతేకాదు హీరోయిన్ కృతి శెట్టి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంది. దీంతో ఈసినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది అంటూ వచ్చిన వార్తలను నిజం చేశారు. నాగ చైతన్య సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా.. నాగార్జున సరసన రమ్యకృష్ణనే నటిస్తుంది అంటున్నారు. ఇక త్వరలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసి, 2022 సమ్మర్‌లో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.

కాగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈసినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై నిర్మిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు. మరి మనం లాంటి ఫీల్ గుడ్ ఎంటర్ టైన్మెంట్ తర్వాత నాగార్జున మరియు నాగ చైతన్య లు కలిసి నటిస్తున్న చిత్రం కావడంతో సినిమాపై ఆసక్తి నెలకొంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.