“అనుభవంగల్ పలిచకల్”(1971 ) మూవీ తో మమ్ముట్టి మలయాళ చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ మమ్ముట్టి సూపర్ స్టార్ గా రాణిస్తున్నారు. మలయాళ మెగాస్టార్‌గా పాపులారిటీ సాధించిన మమ్ముట్టి మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాషలలో 400 చిత్రాలకి పైగా నటించారు. సూపర్ స్టార్ రజనీకాంత్, మోహన్ లాల్ లాంటి స్టార్స్‌తోమమ్ముట్టి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. మమ్ముట్టి తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే. కె.విశ్వనాథ్ దర్శకత్వంలో మమ్ముట్టి నటించిన “స్వాతి కిరణం”మూవీ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకొని అఖండ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తర్వాత మమ్ముట్టికి తెలుగు ప్రేక్షకుల్లోనూ క్రేజ్ పెరిగింది. ఇక మహి వి రాఘవ దర్శకత్వంలో దివంగత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.యస్. రాజశేఖరరెడ్డి జీవిత కథ ఆధారంగా రూపొందిన ‘యాత్ర’ సినిమాలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Thank you dear lal https://t.co/eVBhPTBWXC
— Mammootty (@mammukka) August 6, 2021
ఏ భాషలో నటించినా, తనే సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవడం మమ్ముట్టి ప్రత్యేకత. తనకు ఆ భాష రాకపోయినా నేర్చుకుని చెబుతుంటారు. హీరో మమ్ముట్టి సినీ ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్‌గా 50 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రముఖ మలయాళ నటుడు మోహన్ లాల్ ఈ రోజుతో సోదరుడు ఇండస్ట్రీకొచ్చి 50 ఏళ్ళు పూర్తయ్యాయి. ఈ క్రమంలో ఆయనతో కలిసి 55 సినిమాలలో నటించినందుకు ఎంతో గర్వంగా ఉంది. ఇంకా ఎన్నో గొప్ప చిత్రాలు చేయాలని కోరుకుంటున్నాను అంటూ మమ్ముట్టికి శుభాకాంక్షలు తెలిపారు. ఇదే సందర్భంగా ఆయనకి సౌత్ సినిమా ఇండస్ట్రీలో పలువురు సినీ ప్రముఖులు విషెస్ చెబుతున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: