‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ చిత్రంతో సూపర్ డూపర్ హిట్ కొట్టిన టాలెంటెడ్ డైరెక్టర్ స్వరూప్ ఆర్.ఎస్.జె ఇప్పుడు మిషన్ ఇంపాజిబుల్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. తాప్సీ ప్రధాన పాత్రలో `మిషన్ ఇంపాజిబుల్` సినిమా తెరకెక్కుతుంది. చాలా గ్యాప్ తరువాత తాప్సీ మళ్లీ తెలుగులో చేస్తున్న సినిమా ఇది. ఇక ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈసినిమాలో ఇప్పటికే ఎంతో మంది కీలక పాత్రల్లో నటిస్తుండగా.. ఇప్పుడు మరో విలక్షణ నటుడు కూడా జాయిన్ అయ్యాడు. ఆ నటుడు ఎవరో కాదు ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో మెప్పించిన మలయాళ నటుడు హరీష్ పేరడీ. ఈవిషయాన్ని చిత్రయూనిట్ నేడు అధికారికంగా ప్రకటించింది. మలయాళ చిత్రసీమలో తన నటనతో గుర్తింపు సంపాదించుకోవడమే కాదు, కళ్లతోనే విలనిజాన్ని చూపిస్తూ ప్రత్యేకమైన గుర్తింపుపొందారు హరీష్.
కాగాఎరిడ, తంబి, మెర్సల్, ఖైది, స్పైడర్, రాక్షసి, పులి మురుగన్, భూమియిలే, మనోహర, స్వకార్యం, మడ్డి, లెఫ్ట్ రైట్ లెఫ్ట్, విక్రమ్ వేద ఇలా నలబైకి పైగా చిత్రాల్లో నటించారు. ఈ చిత్రాలన్నీ ఆయనకు నటుడిగా ఎంతో గుర్తింపును తెచ్చి పెట్టడమే కాదు.. ఓ ప్రత్యేకస్థాన్ని సంపాదించిపెట్టాయి.
కాగా నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎన్ ఎం పాష అసోసియేట్ ప్రొడ్యూసర్. దీపక్ యరగర సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తుండగా.. మార్క్ కె రాబిన్ సంగీతం అందిస్తున్నాడు.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: