సక్సెస్ ఫుల్ “కృష్ణ గాడి వీర ప్రేమ గాథ “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన పంజాబీ బ్యూటీ మెహరీన్ “మహానుభావుడు “, రాజా ది గ్రేట్ “,” F 2:ఫన్ &ఫ్రస్టేషన్ “వంటి సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించారు. “నెంజిల్ తునివిరుందాయ్ “మూవీ తో కోలీవుడ్ కు , “డి ఎస్ పి దేవ్ ” మూవీ తో పంజాబీ చిత్రపరిశ్రమకు మెహరీన్ పరిచయం అయ్యారు. మెహరీన్ ప్రస్తుతం ” F 2:ఫన్ &ఫ్రస్టేషన్ ” మూవీ సీక్వెల్ “F 3 “, మారుతి దర్శకత్వంలో సంతోష్ శోభన్ హీరోగా తెరకెక్కుతోన్న “మంచి రోజులు వచ్చాయి” మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసుకున్న తరువాత మెహరీన్ పలు మూవీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న విషయం తెలిసిందే. రామ్ ధూలిపూడి దర్శకత్వంలో శివరాజ్‌కుమార్ కథానాయకుడిగా ఎమోషనల్ లవ్‌స్టోరీగా రూపొందనున్న కన్నడ మూవీతో హీరోయిన్ మెహరీన్ తాజాగా శాండల్ వుడ్ కు ఎంట్రీ ఇస్తున్నారు. మెహరీన్ ఇప్పుడు మరో తెలుగు మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. “అడ్డా “, “ఓటర్ “మూవీస్ ఫేమ్ జి కార్తీక్ రెడ్డి దర్శకత్వంలో హవీష్ కోనేరు హీరోగా ఒక రొమాంటిక్ ఎంటర్ టైనర్ తెరకెక్కనుంది. ఈ మూవీ లో మెహరీన్ కథానాయికగా నటించనున్నారు.
[subscribe]



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: