శ్రీ లక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్ బ్యానర్ పై శ్రీవాస్ దర్శకత్వంలో గోపీచంద్ , అనుష్క జంటగా రూపొందిన “లక్ష్యం “మూవీ 2007 సంవత్సరం జూలై 5వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. జగపతి బాబు ఒక కీలక పాత్రలో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు. కమర్షియల్ ఎలిమెంట్స్‌కు తోడు ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా బాగానే వర్కవుట్ కావడంతో లక్ష్యం సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. హీరో గోపీచంద్ ఫస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన “లక్ష్యం ” మూవీ 14 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“లక్ష్యం ” మూవీ లో గోపీచంద్ , జగపతి బాబు ల పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. హీరోయిన్ అనుష్క తన గ్లామర్ తో ప్రేక్షకులను అలరించారు. హీరో గోపీచంద్ , అనుష్క ల స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. శ్రీవాస్ కు దర్శకుడిగా “లక్ష్యం ” మూవీ మొదటి చిత్రం అయినా కామెడీ , రొమాన్స్ , యాక్షన్ , ఫ్యామిలీ డ్రామాగా రూపొందించడంలో ఎక్స్ పీరియన్స్ ఉన్న డైరెక్టర్ గా తెరకెక్కించారు. దర్శకుడు శ్రీవాస్ , హీరో గోపీచంద్ కాంబినేషన్ లో రూపొందిన “లౌక్యం “మూవీ ఘనవిజయం సాధించింది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: