బ్లాక్ బస్టర్ “ఉప్పెన “మూవీతో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయిన కృతి శెట్టి ఆ మూవీ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. “ఉప్పెన “మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. టాలెంటెడ్ యాక్ట్రెస్ కృతి శెట్టి టాలీవుడ్ లో పలు మూవీ ఆఫర్స్ అందుకుంటున్నారు. కృతి శెట్టి కథానాయికగా పలు మూవీస్ చర్చల దశలో ఉన్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కృతి శెట్టి ప్రస్తుతం నేచురల్ స్టార్ నాని ‘శ్యామ్ సింగరాయ్”, సుధీర్ బాబు “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.ఎనర్జిటిక్ హీరో రామ్ కథానాయకుడిగా రూపొందుతున్న మూవీ కి కృతి శెట్టి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. లాక్ డౌన్ కారణంగా షూటింగ్స్ నిలిచిపోవడం తో మూడు నెలల క్రితం కృతిశెట్టి ముంబై కి చేరుకున్నారు. కరోనా పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకొనడంతో షూటింగ్స్ ప్రారంభం కావడంతో కృతి శెట్టి వర్క్ లో పాల్గొనడానికి సిద్ధం అయ్యారు. బెంచ్ మార్క్ స్టూడియోస్ బ్యానర్ పై ఫీల్ గుడ్ మూవీస్ దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో సుధీర్ బాబు , కృతి శెట్టి జంటగా “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’మూవీ కరోనా కారణం గా నిలిచిపోయింది. ఈ మూవీ షూటింగ్ ఈ రోజు హైదరాబాద్ లో పునః ప్రారంభం అయ్యింది. హీరోయిన్ కృతిశెట్టి సెట్స్ లో పాల్గొన్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: