విభిన్నమైన కథలను చేయడంలో శ్రీవిష్ణు ఎప్పుడూ ముందుంటాడు. ఎప్పటికప్పుడు కొత్త తరహా కథలు ఎంచుకుంటూ.. కొత్తదర్శకుల్ని పరిచయం చేయడంలో ముందుంటాడు. ఇప్పుడు కూడా అలాంటి కథే ఎంచుకున్నాడు. హాసిత్ గోలి దర్శకత్వంలో రాజా రాజ చోర అనే మూవీ తో వస్తున్నాడు. ఇక రాజ రాజ చోర అప్ డేట్స్ కూడా ఈరోజు నుండి ఇస్తానని శ్రీవిష్ణు ఇప్పటికే చెప్పిన సంగతి తెలిసిందే కదా. ఇక చెప్పినట్టే నేడు అప్ డేట్ తో వచ్చేశాడు. ఈ సినిమా టీజర్ రిలీజ్ కు టైమ్ ను ఫిక్స్ చేశారు. ఈనెల 18న టీజర్ రాబోతుందని చెప్పడానికి మరో చిన్న టీజర్‌ని విడుదల చేసింది చిత్రబృందం. ఇక వీడియోలో ‘నీకు ఊ.. కొట్టే కథ తెలుసా? ఏది చెప్పినా ఊ.. కొట్టాలి’ అని అసలు కథ మొదలు పెడుతుంది గంగవ్వ. ‘‘అనగనగా ఓ సూర్యుడుండేటోడు. ఆ సూర్యడేమో భూమికి ప్రాణం ఇచ్చాడు. భూమి నుంచి కోతి, బంగారం వచ్చాయి.. మనిషి దొంగోడుగా, కిరీటం రాజుగా రూపాంతరం చెందాయని చెపుతుంది. ఈవీడియోను యానిమేషన్ లో క్రియేట్ చేసారు. రాజు, దొంగ, కిరీటం ఈ మూడింటి మధ్య ఏం జరిగిందనేది కథ అని ఈ టీజర్ ను బట్టి అర్థమవుతంది. మరి టీజర్ అప్ డేటే ఇంత క్రియేటివ్ గా చేశారు. మరి టీజర్ ఎలా ఉంటుందో చూడాలి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Inthaki aa Donga Dorukuthaada?
Here’s #ChoraGaadha a quirky tale by Gangavva
– https://t.co/iaOw9sP4le#RajaRajaChora #RRC@sreevishnuoffl @vishwaprasadtg @AbhishekOfficl @vivekkuchibotla @hasithgoli @TheSunainaa @akash_megha #VivekSagar @peoplemediafcy @AAArtsOfficial pic.twitter.com/anShFCU0tr— People Media Factory (@peoplemediafcy) June 11, 2021
కాగా మేఘా ఆకాష్,సునయన హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తుండగా.. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు. ఇంకా ఈ సినిమాలో తనికెళ్ళ భరణి, రవిబాబు,కాదంబరి కిరణ్, శ్రీకాంత్ అయ్యంగార్, అజయ్ ఘోష్,వాసు ఇంటూరి తదితరులు నటిస్తున్నారు.
ఈసినిమాతో పాటు ‘బాణం’ ఫేమ్ చైతన్య దంతులూరి దర్శకత్వంలో శ్రీవిష్ణు హీరోగా ”భళా తందనాన” అనే సినిమా కూడా చేస్తున్నాడు. ఈసినిమా కూాడా షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాలో కేథరిన్ థెరిస్సా హీరోయిన్ గా నటిస్తుండగా.. వారాహి చలన చిత్రం బ్యానర్ పై సాయి కొర్రపాటి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: