కరోనా సెకండ్ వేవ్ విజృంభణతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. కరోనా బాధితులు హాస్పిటల్ బెడ్స్ , ఆక్సిజన్ సిలిండర్లు కొరతతో కష్టాలపాలవుతున్నారు. సినీ సెలబ్రిటీస్ కరోనా బాధితులకు తమ వంతు సాయం అందిస్తున్నారు. యంగ్ హీరో నిఖిల్ ప్రజలకు కరోనా వ్యాప్తి నివారణకై తగు జాగ్రత్తలు చెబుతూ సోషల్ మీడియా లో పోస్ట్స్ పెడుతున్నారు. తన వంతు సాయంగా నిఖిల్ ఆక్సిజన్ సిలిండర్స్ , మెడిసిన్స్ కరోనా బాధితులకు అందజేస్తున్న విషయం తెలిసిందే. హీరో నిఖిల్ ఇప్పుడు గ్రామాలలో నిఖిల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టాలనే నిర్ణయం తీసుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి , సూపర్ స్టార్ మహేష్ , తాజాగా నందమూరి బాలకృష్ణ ఇలా ఒక్కొక్కరుగా వాక్సినేషన్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నారు. నిజానికి ప్రస్తుతం దేశంలో కరోనా వాక్సిన్స్ కొరత చాలా ఉంది. ఇలాంటి సమయంలో కూడా హెల్ప్ చేసేందుకు ఎల్లప్పుడూ సిద్ధమే అంటూ నిఖిల్ స్పందిస్తున్నారు. ఇటీవలే తెలంగాణ గవర్నమెంట్ ఎవరైనా వారి సొంత గ్రామాల్లో ఏరియాల్లో వాక్సిన్ పంపిణీ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవచ్చని పర్మిషన్ ఇచ్చింది కాబట్టి తాను కూడా తన టీమ్ తో కలిసి త్వరలో వాక్సినేషన్ డ్రైవ్ స్టార్ట్ చేయనున్నట్లు ట్విట్టర్ ద్వారా నిఖిల్ తెలిపారు. ఎవరికైనా సెకండ్ డోస్ వాక్సిన్ మిస్ అవుతున్నాం అనుకుంటే, వారు తనకు ఇన్ స్టా గ్రామ్ లేదా ట్విట్టర్ ద్వారా ట్యాగ్ చేసి చెప్పవచ్చు ననీ , కొన్ని రోజుల్లో ప్రతివారం గ్రామాల్లో వాక్సినేషన్ ప్రోగ్రాం ప్లాన్ చేస్తున్నామనీ చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: