అమెజాన్ ప్రైమ్ లో రీసెంట్ గా రిలీజ్ అయిన ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ ఎంత సక్సెస్ అయిందో చూస్తూనే ఉన్నాం. మొదటి సిరీస్ కంటే కూడా ఈసిరీస్ ఇంకా బావుందన్న ప్రశంసలు దక్కించుకుంది. ఇక ఈసిరీస్ లో నటించిన సమంత గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె నటనకు గాను.. యాక్షన్ సీన్స్ గాని సూపర్ రెస్పాన్స్ వస్తుంది. పలువురి సెలబ్రిటీల నుండి కూడా ప్రశంసలు దక్కించుకుంటుంది సమంత. ఈనేపథ్యంలోనే సామ్ తాను కూడా ఫ్యాన్ అయిపోయానంటుంది మరో హీరోయిన్. ఈహీరోయిన్ ఎవరో కాదు రకుల్ ప్రీత్ సింగ్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ చూసి రకుల్ ప్రీత్ సింగ్ తన ట్విట్టర్ ద్వాారా సమంతపై.. టీమ్ పై ప్రశంసలు కురిపించింది. ఫ్యామిలీ మ్యాన్ 2 చూశాను. అందరూ చాలా బాగా నటించారు. మనోజ్ బాజ్‌పాయ్ అద్భుత నటన గురించి చెప్పాలంటే మాటలు సరిపోవడం రావడం లేదు.. ఇక సమంత.. నీ యాక్టింగ్‌కు హ్యాట్సాఫ్. రాజీ పాత్రలో జీవించేశావు. ఈ సిరీస్ చూశాక నాతో సహా మా కుటుంబం అంతా నీకు అభిమానులుగా మారిపోయారు. మీ టీమ్‌కు శుభాభినందనలు’ అని రకుల్ ట్వీట్ చేసింది.
Has also become your fan now besides me 😁😘 @rajndk congratulationssss n more power to you ! @Samanthaprabhu2 @BajpayeeManoj #PriyaManiRaj
— Rakul Singh (@Rakulpreet) June 8, 2021
కాగా రాజ్ అండ్ డీకే రూపొందించిన ఈ సిరీస్‌లో మనోజ్ బాజ్‌పాయ్, సమంతతో పాటు ప్రియమణి, షరీబ్ హష్మి, సాజిద్, మేజర్ సమీర్, దేవ దర్శిని, ఆనందసామి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారం అవుతోంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: