ఏక్ మినీ కథ సినిమా హిట్ తో ఇండస్ట్రీలో బిజీ అయిపోయాడు సంతోష్ శోభన్ . ఇప్పటికే పలు పెద్ద పెద్ద బ్యానర్లలో సినిమాలు కమిట్ అయినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం సారంగ ప్రొడక్షన్స్ బ్యానర్ లో అభిషేక్ మహర్షి అనే నూతన దర్శకుడితో ఒక సినిమా చేస్తున్నాడు. ఇటీవలే ఈసినిమా ఫస్ట్ లుక్, టైటిల్ ను రిలీజ్ చేశారు. ప్రేమ్ కుమార్ అనే టైటిల్ తో ఈసినిమా తెరకెక్కుతుంది. ఇక ఈసినిమా కొంతవరకూ షూటింగ్ ను పూర్తి చేసుకున్నట్టు తెలుస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా విజయవంతమైన చిత్రాల దర్శకుడు మారుతితో కూడా సంతోష్ శోభన్ సినిమా చేస్తున్నట్టు తెలుస్తుంది. ఒక చిన్న కాన్సెప్ట్ ఓరియెంటెడ్ స్క్రిప్ట్ ను రాసుకున్న మారుతి ఈసినిమా కోసం సంతోష్ శోభన్ ను సెలక్ట్ చేసుకున్నాడట. ఎలాగూ తెలంగాణలో మధ్యాహ్నం 1 గంట వరకూ షూటింగ్ చేసుకునే వెసులుబాటు ఉండటంతో ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ను కూడా మొదలుపెట్టేశాడట. ఈసినిమా షూటింగ్ చాలా తక్కువ రోజుల్లో ముగించాలని నిశ్చయించుకున్నాడట.
ఇక ఈసినిమాలో హీరోయిన్ గా మెహ్రీన్ ను ఫిక్స్ చేశాడు. మరోవైపు మెహ్రీన్ పెళ్లి కూడా వాయిదా పడడంతో కొత్త చిత్రాలను ఒప్పుకుంటోంది. ఈసినిమా గురించి మరిన్ని విషయాలు తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే. కాగా మారుతి ఇప్పటికే గోపీచంద్ హీరోగా పక్కా కమర్షియల్ చిత్రాన్ని షూటింగ్ చేస్తోన్న విషయం తెల్సిందే.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: