గత ఏడాది అల వైకుంఠపురములో సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన బన్నీ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్నాడు. ఇక అనుకోని విధంగా ఈసినిమాను కాస్త రెండు పార్ట్ లుగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటివరకూ షూటింగ్ చేసింది పార్ట్ వన్ కు సరిపోతుండటంతో మొదటి పార్ట్ మ్యాగ్జిమమ్ ఈఏడాదే రిలీజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఇక సుక్కూ ప్రస్తుతం రెండో పార్ట్ పై కాన్సన్ ట్రేషన్ చేస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఈసినిమాలో విలన్ గా మలయాళ టాలెంటెడ్ నటుడు ఫహద్ ఫాజిల్ నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. అయితే ఇక్కడే ఒక చిక్కు వచ్చింది. మిగిలిన వాళ్లు తమ పాత్రలకు డబ్బింగ్ చెప్పేసుకుంటారు.. ఇక హీరోయిన్ రష్మిక కూడా ఈమధ్య తనే డబ్బింగ్ చెప్పుకుంటుంది. కానీ ఫహద్ ఫాజిల్ కు మాత్రం అస్సలు తెలుగు రాదు. ఈనేపథ్యంలోనే ఫహాద్ కూడా తెలుగు నేర్చుకోవడం కోసం కసరత్తులు చేస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం షూటింగ్ లు లేకపోవడంతో తెలుగు భాషను నేర్చుకుంటున్నాడట. తెలుగు భాషపై ముఖ్యంగా ఈ సినిమాలో చెప్పబోయే చిత్తూరు యాసపై పట్టు సాధించాలని ట్రైన్ అవుతున్నట్టు తెలుస్తుంది.
కాగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో విలన్ పాత్రలో ఫహద్ ఫాజిల్ నటిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈసినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. పుష్ప బన్నీ మెదటి పాన్ ఇండియా చిత్రంగా ఐదు భాషలలో విడుదల కానుంది. ఈ ఏడాది ఆగస్టు 13న `పుష్ప` సినిమా విడుదల చేస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: