చిరు సర్ ప్రైజ్ చేయాలనుకున్నాడు..!

Dialogue King Mohan Babu Thanks Megastar Chiranjeevi For Giving Voiceover To His Film Son Of India,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Movie News 2021,Tollywood Movie Updates,Dialogue King Mohan Babu,Son Of India,Son Of India Movie,Son Of India Telugu Movie,Son Of India Movie Updates,Son Of India Teaser,Son Of India Movie Teaser,Son Of India Telugu Movie Teaser,Mohan Babu Son Of India,Mohan Babu,Actor Mohan Babu,Hero Mohan Babu,Mohan Babu Latest News,Mohan Babu New Movie,Mohan Babu Son Of India Teaser,Son Of India Official Teaser,Teaser Of Son Of India,Megastar Chiranjeevi,Actor Chiranjeevi,Mohan Babu Thanks Megastar Chiranjeevi,Mohan Babu Thanks Chiranjeevi,Chiranjeevi Latest News,Chiranjeevi Voiceover Son Of India,Chiranjeevi Voiceover To Mohan Babu Son Of India Teaser,Megastar Voice Over,Chiranjeevi's Voice For Son Of India Teaser,Chiranjeevi's Voiceover For Mohan Babu,Chiranjeevi Voiceover In Son Of India Teaser,#SonofIndiaTeaser

రత్నబాబు దర్శకత్వంలో కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా సన్ ఆఫ్ ఇండియా. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉండగా నేడు ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమాకు మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ అందించడం సర్ ప్రైజింగ్ ఎలిమెంట్. ఇక తన టీజర్ కు వాయిస్ ఓవర్ అందించినందుకు చిరు పై ప్రశంసలు కురిపిస్తూ ఒక లేఖ విడుదల చేశాడు మోహన్ బాబు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఆ లేఖలో ఏముందంటే.. ‘స‌న్ ఆఫ్ ఇండియా‘ తీస్తున్నాననే సంగతి అభిమానులకు, ప్రేక్షకులకు తెలుసని… ఈ చిత్రానికి ప్రారంభంలో వాయిస్ ఓవర్ అవసరమైంది.. దీంతో, వాయిస్ ఓవర్ కు చిరంజీవి అంకుల్ వాయిస్ అయితే బాగుంటుందని తన కుమారుడు విష్ణు చెప్పాడని… వెంటనే చిరంజీవికి ఫోన్ చేసి తాను అడిగానని తెలిపారు. దీనిపై చిరంజీవి వెంటనే స్పందించారని… ఎన్నిరోజుల్లో కావాలి బాబు? అని అడిగారని… పది రోజుల్లో ఎప్పుడైనా ఓకే అన్నానని చెప్పారు. వాయిస్ ఓవర్ మ్యాటర్ పంపమని చిరంజీవి అడిగారని… తాను పంపించానని తెలిపారు.

‘ఆచార్య’ సినిమా పనులతో బిజీగా ఉన్నప్పటికీ… తాను అడిగిన మూడు రోజుల్లోనే తనే థియేటర్ బుక్ చేసి, తనే డబ్బింగ్ చెప్పి పంపాలనుకున్నాడు. ఆ విషయం తెలిసి, విష్ణును అక్కడకు పంపానని మోహన్ బాబు చెప్పారు. విష్ణును చూసిన చిరంజీవి నవ్వుతూ… నిన్నెవరు రమ్మన్నారని అన్నాడని తెలిపారు. డబ్బింగ్ పూర్తి చేసి నాన్నకి సర్ ప్రైజ్ ఇద్దామనుకున్నానని చెప్పాడని అన్నారు. ఇంత గొప్ప మనసు ఎవరికుంటుందని మోహన్ బాబు ప్రశంసించారు. తాను అడగ్గానే ఇంత గొప్పగా స్పందించిన చిరంజీవి తీరుకు, అతని సహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని చెప్పారు. సూర్యని ఈ సినిమా టీజర్ ను నీ చేతుల మీదుగా రిలీజ్ చేద్దామనుకుంటున్నా అని చెప్పాను .. వెంటనే అతను మీరెందుకు సార్ పెద్దవారు చెప్తారు.. నేను విష్ణుతో మాట్లాడి మేం ప్లాన్ చేసుకుంటాం.. మీరు చెప్పిన టైంకు టీజర్ రిలీజ్ అవుతుందని చెప్పాడు.. సూర్యకు నామీద ఉన్న ప్రేమకు ధన్యవాదాలు తెలిపారు. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్ డేట్స్ తో అభిమానుల ముందుకు వస్తానని చెప్పారు.

కాగా ఈ చిత్రాన్ని 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ మరియు లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్స్ పై మోహన్ బాబు నిర్మిస్తున్నారు. మ్యాస్ట్రో ఇళయ రాజా సంగీతం అందిస్తున్నారు. అంతేకాదు మోహన్ బాబు ఈ సినిమాకు స్క్రీన్ ప్లే కూడా అందిస్తున్నాడు. మంచు విష్ణు భార్య.. మోహన్ బాబు కోడలు వెరోనికా ఈ సినిమాకు స్టయిలిస్ట్ గా పనిచేస్తున్నారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here