‘సన్ ఆఫ్ ఇండియా’ టీజర్ రిలీజ్

Dialogue King Mohan Babu Starrer Son Of India Movie Teaser Is Out,Telugu Filmnagar,Dialogue King Mohan Babu,Mohan Babu In And As Son of India,Son Of India,Son Of India Movie,Son Of India Telugu Movie,Son Of India Movie Updates,Son Of India Teaser,Son Of India Movie Teaser,Son Of India Telugu Movie Teaser,Son Of India Teaser Out,Son Of India Movie Teaser Out Now,Son Of India Movie Teaser Unveiled,Mohan Babu Son Of India,Mohan Babu,Actor Mohan Babu,Hero Mohan Babu,Mohan Babu Latest News,Mohan Babu New Movie,Mohan Babu Latest Movie,Mohan Babu Son Of India Teaser,Mohan Babu Son Of India Movie Teaser,Son Of India Movie Teaser Launched By Suriya,Mohan Babu Son Of India Telugu Movie Teaser,Ilaiyaraaja,Ratnababu,Suriya,Hero Suriya,Vishnu Manchu,Collection King Mohan Babu,Mohan Babu New Movie Teaser,Son of India Teaser,Diamond Ratna Babu,Son Of India Official Teaser,Son Of India First Look Teaser,Mohan Babu Son Of India Official Teaser,Teaser,Teaser Of Son Of India,Son Of India Movie New Teaser,#SonofIndiaTeaser

తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో సినిమాల్లో నటించిన కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు గత కొద్దికాలంగా చాలా తక్కువ సినిమాల్లో కనిపిస్తున్న సంగతి తెలిసిందే. అప్పుడప్పుడు ఒకటో రెండో సినిమాల్లో కనిపిస్తున్నారు. ఈనేపథ్యంలోనే ఇటీవల వచ్చిన ‘ ఆకాశం నీ హద్దురా..!’ సినిమాలో భక్త వత్సల నాయుడు అనే కీలక పాత్రలో నటించాడు. ఇదిలా ఉండగా తానే ప్రధాన పాత్రలో ‘స‌న్ ఆఫ్ ఇండియా ‘ అనే సినిమాతో వస్తున్నాడు. రత్నబాబు దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా ఈటీజర్ ను ముందుగా చెప్పినట్టే సూర్య రిలీజ్ చేశాడు. ఇక టీజర్ లో సర్ ప్రైజ్ చేసే ఎలిమెంట్ ఏంటంటే చిరు వాయిస్ ఓవర్ తో టీజర్ మొదలవ్వడం. “మన అంచనాలకు అందని ఓ వ్యక్తిని ఇప్పుడు పరిచయం చేయబోతున్నా అంటూ చిరంజీవి వాయిస్ తో మొదలైన టీజర్ లో ఎప్పుడు? ఏ వేషంలో ఉంటాడో? ఆ దేవుడికే ఎరుక. తన బ్రెయిన్‌లో న్యూరాన్స్‌ ఎప్పుడు, ఎలాంటి ఆలోచనలను పుట్టిస్తుందో ఏ బ్రెయిన్‌ స్పెషలిస్టూ చెప్పలేడు” అని మోహన్‌ బాబు గురించి ఎలివేషన్ ఇచ్చారు. ఇంకా నేను చీకటిలో ఉండే వెలుతురిని.. వెలుతురులో ఉండే చీకటిని’, ‘నేను కసక్‌ అంటే మీరందరూ ఫసక్‌’ అని మోహ‌న్ బాబు చెప్పే డైలాగ్స్ కూడా ఆక‌ట్టుకునేలా ఉన్నాయి.

కాగా ఈ చిత్రాన్ని 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ మరియు లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్స్ పై మోహన్ బాబు నిర్మిస్తున్నారు. మ్యాస్ట్రో ఇళయ రాజా సంగీతం అందిస్తున్నారు. అంతేకాదు మోహన్ బాబు ఈ సినిమాకు స్క్రీన్ ప్లే కూడా అందిస్తున్నాడు. మంచు విష్ణు భార్య.. మోహన్ బాబు కోడలు వెరోనికా ఈ సినిమాకు స్టయిలిస్ట్ గా పనిచేస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven + 7 =