వరస బ్లాక్ బస్టర్ మూవీస్ తోప్రేక్షక , అభిమానులను అలరిస్తూ మహేష్ బాబు టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా రాణిస్తున్నారు. తరగని అందం ,సక్సె ఫుల్ మూవీస్ తో అభిమానులను ఆకట్టుకుంటున్న మహేష్ బాబు కు మహిళా అభిమానులు కూడా అధికమే. సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “సర్కారు వారి పాట “మూవీ లో నటిస్తున్నారు. మహేష్ బాబు పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
త్రివిక్రమ్ శ్రీనివాస్ , మహేశ్ బాబు కాంబినేషన్ లో రూపొందిన “అతడు “మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక మూవీ కి మహేష్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. “సర్కారు వారి పాట “మూవీ కి సమాంతరంగా ఈ మూవీ తెరకెక్కనుంది. “సర్కారు వారి పాట “మూవీ సంక్రాంతికి రిలీజ్ కానుంది. త్రివిక్రమ్ మూవీ సమ్మర్ లో రిలీజ్ కానుంది. ఈ రెండుమూవీస్ తో పాటు మహేష్ బాబు దర్శకులు అనిల్ రావిపూడి , రాజమౌళి మూవీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గ్యాప్ లేకుండా వరస కమిట్ మెంట్స్ తో తమ అభిమాన హీరో బిజీగా ఉన్నందుకు అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: