హీరో సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి బ్లాక్ బస్టర్ “ఉప్పెన” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు.”ఉప్పెన ” మూవీ రికార్డ్ కలెక్షన్స్ తో ప్రదర్శించబడి 100 కోట్ల క్లబ్ లో చేరింది. ఆమూవీ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్న కృతిశెట్టి టాలీవుడ్ లో పలు మూవీ ఆఫర్స్ అందుకుంటున్నారు. నేచురల్ స్టార్ నాని ‘శ్యామ్ సింగరాయ్”, సుధీర్ బాబు “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’మూవీస్ లో కృతి శెట్టి కథానాయికగా నటిస్తున్నారు. లింగుస్వామి దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్ కథానాయకుడిగా రూపొందుతున్న మూవీ కి కృతి శెట్టి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
టాలీవుడ్ యంగ్ హీరోలకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా కృతిశెట్టి మారారు. పలువురు దర్శక , నిర్మాతలు , హీరోలు తమ మూవీస్ లో కృతిశెట్టి ని కథానాయికగా నటింపజేయడానికి ఆసక్తి చూపుతున్నారు. హీరో నితిన్ ప్రస్తుతం బాలీవుడ్ బ్లాక్ బస్టర్ “అంధాధున్ ” మూవీ తెలుగు రీమేక్ “మాస్ట్రో ” మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ తరువాత వక్కంతం వంశీ దర్శకత్వంలో నితిన్ హీరోగా ఒక మూవీ తెరకెక్కనుంది. ఆ మూవీ లో కథానాయికగా కృతి శెట్టి ని సంప్రదిస్తున్నట్టు సమాచారం.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: