సక్సెస్ ఫుల్ “దొరసాని “మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయిన క్రేజీ హీరో విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ“మిడిల్ క్లాస్ మెలోడీస్ “మూవీ తో ప్రేక్షకులను అలరించారు. ఆనంద్ ఇప్పుడు హైవే బ్యాక్ డ్రాప్ లో రూపొందే ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ బ్యానర్ పై కె వి గుహన్ దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ హీరోగా క్రైమ్ థ్రిల్లర్ “హైవే “మూవీ ఈ రోజు పూజాకార్యక్రమం జరుపుకుంది. రెగ్యులర్ షూటింగ్ జూన్ మొదటి వారంనుండి ప్రారంభం కానుందనీ , పలువురుప్రముఖ నటులు ముఖ్య పాత్రలలో నటిస్తారనీ, “హైవే “మూవీ కి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయనీ నిర్మాత వెంకట్ తలారి చెప్పారు. తెలుగు , తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ కు సినిమాటోగ్రాఫర్ గా పని చేసిన కె వి గుహన్ సక్సెస్ ఫుల్ “118 “మూవీ తో దర్శకుడిగా మారిన విషయం తెలిసిందే.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: