యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఓం రౌత్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా ఆదిపురుష్. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించనున్నాడు. అలాగే కృతి సనన్ సీతగా కనిపించనుంది. మరోవైపు బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడిగా కనిపించబోతున్నాడు. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ కు కూడా మొన్నటివరకూ స్పీడుగానే జరుగుతుంది . అయితే కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉండటంతో ఈసినిమా షూట్ కు కూడా బ్రేక్ పడింది. సినిమా కోసం ముంబైకే మకాం మార్చిన ప్రభాస్ కూడా ఇక్కడికే వచ్చేశాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. అదేంటంటే… ఈసినిమా లొకేషన్ ను మొత్తం హైదరాబాద్ కు షిఫ్ట్ చేయాలనుకుంటున్నారట. ఇక్కడితో పోల్చుకుంటే ముంబైలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది.. అక్కడ మళ్లీ షూటింగ్ లకు ఎప్పుడు అనుమతి వస్తుందో కూడా తెలీదు.. దీంతో చిత్రయూనిట్ మొత్తం హైద్రాబాద్ కే షిఫ్ట్ అవ్వాలని చూస్తున్నారట.. ఇక్కడ కూడా భారీ ఇండోర్ సెట్ ఏర్పాటు చేసి అందులో షూటింగ్ చేయాలని అనుకుంటున్నట్టు తెలుస్తుంది. ఈసినిమా లీడ్ యాక్టర్స్… టెక్నికల్ టీమ్ ఇక్కడికి వచ్చి మే రెండో వారం నుండి షూటింగ్ ను స్టార్ట్ చేయలని చూస్తున్నట్టు తెలుస్తుంది. ఈసినిమాను 2022 ఆగస్టు 11న విడుదల చేస్తామని ఎప్పుడో ప్రకటించారు.
కాగా రాధాకృష్ణ దర్శకత్వంలో వస్తున్న ప్రభాస్ రాధేశ్యామ్ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. అలాగే ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న సలార్ సినిమా షూటింగ్ దశలో ఉంది.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: