తెలుగు , తమిళ , హిందీ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో శృతి హాసన్ తన అందం అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. సూపర్ హిట్ “క్రాక్ “, “వకీల్ సాబ్ “మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి శృతి ప్రేక్షకులను అలరించారు.తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి కి జోడీ గా శృతి నటించిన “లాభం”తమిళ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. సోషల్ మీడియా లో శృతి తన ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే . పలు ఫొటో షూట్స్ లో పాల్గొని శృతి ఆ ఫొటోలను సోషల్ మీడియా లో షేర్ చేస్తున్న విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందుతున్న “సలార్ “మూవీ లో శృతి , ప్రభాస్ కు జోడీగా నటిస్తున్నారు. విదేశీ సింగర్స్ వేసుకునే ఫ్యాషన్ ట్రెండ్ ని శృతి ఫాలో అవుతున్న విషయం తెలిసిందే. సోషల్ మీడియా లో శృతి డ్రెస్ లపై కామెంట్స్ రావడం తో శృతి స్పందించారు. నాకు నచ్చినట్లు ఉంటా… నాకు నచ్చిందే చేస్తా , .మీరు కూడా మీకు ఎలా సంతోషం కలుగుతుందో అలా ఉండండి అని హీరోయిన్ శృతి హాసన్ చెబూతూ మనం వేసుకునే డ్రెస్, ఫ్యాషన్… కాలాన్ని బట్టి మారుతుంటాయనీ , .ఇప్పుడు చాలా విచిత్రంగా అనిపించే ఫ్యాషన్… కొన్నాళ్ళకు రెగ్యులర్ ట్రెండ్ కావొచ్చు. కాబట్టి మనకు నచ్చింది చెయ్యాలి అని చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: