విభిన్న పాత్రలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపించే నటుల్లో సత్యదేవ్ ఎప్పుడూ ముందుంటాడు. అందుకే అతని సినిమాలు చేయడానికి సినీ లవర్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ప్రస్తుతం అయితే సత్యదేవ్ నుండి వస్తున్న సినిమా కృష్ణమ్మ. వీవీ గోపాల కృష్ణ దర్శకత్వంలో ఈసినిమా వస్తుంది. ఈసినిమా నుండి వచ్చిన అప్ డేట్లు సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఇక ఎన్నో అంచనాల మధ్య ఈసినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈసినిమా ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సత్యదేవ్ పలు ఆసక్తికర విషయాలు తెలియచేశారు. చాలా మంది హీరోలకు పలువురి బయోపిక్స్ లో చేయాలని ఉంటుందని అన్నారు. ఈనేపథ్యంలో సత్యదేవ్ కూడా బయోపిక్ చేయడానిక ఆసక్తి కనపరిచారు. ఆ బయోపిక్ ఎవరి గురించో కాదు.. మాజీ ఇండియా క్రికెటర్ అందులోని తెలుగువాడు అయినటువంటి అంబటి రాయుడు బయోపిక్ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపాడు. మరి సత్యదేవ్ కోరిక మేరకు తనకోసం కథను ఎవరైనా రెడీ చేస్తారేమో చూద్దాం..
ఇంకా ఈసినిమాలో లక్ష్మణ్, కృష్ణ, అథిరా రాజ్, అర్చన, నంద గోపాల్, రఘు కుంచె, తారక్, సత్యం కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ సమర్పణలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. అరుణాచల క్రియేషన్స్ బ్యానర్‌పై కృష్ణ కొమ్మలపాటి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాలబైరవ సంగీతం అందిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























