‘ది ఫ్యామిలీ మ్యాన్’ అమెజాన్ ప్రైమ్ లో వచ్చిన ఈ వెబ్ సిరీస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మనోజ్ బాజ్‌పెయ్, ప్రియమణి ప్రధాన పాత్రల్లో స్పై థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన ఈ వెబ్ సిరీస్ మంచి ప్రేక్షకాదరణే పొందింది. దీంతో మొదటి సీజన్ సూపర్ హిట్ అవ్వడంతో రెండో సీజన్ కూడా తెరకెక్కిస్తున్న సంగతి కూడా విదితమే. ఇక ఈ సీజన్ కోసం ఎంతోమంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ ఎదురుచూపులకు తగ్గట్టు ఈ వెబ్ సిరీస్ రిలీజ్ అవ్వడం కూడా లేట్ అవుతుంది. ఎప్పుడో రిలీజ్ కావాల్సిందే కరోనా వల్ల లేట్ అయింది. ఇక ఈఏడాది ఫిబ్రవరి 12 రిలీజ్ చేద్దామనుకున్నారు అది కూడా కుదరలేదు. సమ్మర్ లో రిలీజ్ అని చెప్పారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే ఈ వెబ్ సిరీస్ రిలీజ్ కు అసలు కారణం ఇప్పుడు బయటకు వస్తుంది. అదేంటంటే.. ఈ సిరీస్ లో కొన్ని సీన్లను మళ్లీ రీషూట్ చేస్తున్నారట డైరెక్టర్లు రాజ్ నిడిమోరు, కృష్ణ డీకేలు. దానికి కొంత సమయం పడుతుండటంతో రిలీజ్ కూడా లేట్ అవుతుంది అంటున్నారు. మొత్తం పనులు అయిపోయిన తరువాత మేలో రిలీజ్ చేయాలని చూస్తున్నట్టు తెలుస్తుంది.
ఇక ఈ వెబ్ సిరీస్ లో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఓ టెర్రరిస్ట్ పాత్రలో సమంత నటిస్తున్నట్టు తెలుస్తుంది. హిందీ, తెలుగు మరియు తమిళ్ భాషల్లో ఈ సిరీస్ రిలీజ్ కానుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: