హెచ్. వినోత్ దర్శకత్వంలో అజిత్ హీరోగా ‘వాలిమై’ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాలో అజిత్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు ఇక ఈసినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుంది. దాదాపు చాలా వరకూ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఇక ఇదిలా ఉండగా ఈసినిమా నుండి అజిత్ ఫస్ట్ లుక్ ను ఆయన పుట్టిన రోజు అంటే మే 1న రిలీజ్ చేస్తామని చెప్పిన సంగతి తెలిసిందే కదా. అయితే ఇప్పుడు అది కూడా పోస్ట్ పోన్ చేసేశారు. ఈవిషయాన్ని నిర్మాత బోనీ కపూర్ తన ట్విట్టర్ ద్వారా తెలియచేశాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అజిత్ కుమార్ 50వ పుట్టినరోజును పురస్కరించుకొని మే 1న ‘వలిమై’ చిత్ర ఫస్ట్ లుక్‌ను విడుదల చేయాలని భావించాం. మేము ఈ స్టేట్‌మెంట్ ఇచ్చినప్పుడు కరోనా సెకండ్ వేవ్ భారతదేశాన్ని ఈ విధంగా సునామీలా వ్యాపిస్తుందని గ్రహించలేదు. అయినవారిని కోల్పోయి.. అందరూ మానసిక వేదనను అనుభవిస్తున్నారు. ఇలాంటి సమయంలో వలిమై చిత్ర ఫస్ట్ లుక్‌ని మే 1వ తేదీన విడుదల చేయడం మంచిది కాదని చిత్రయూనిట్ అంతా నిర్ణయించింది. త్వరలోనే దీనికి మరో డేట్ ప్రకటిస్తాం. అందరూ జాగ్రత్తగా, క్షేమంగా ఉండాలని ప్రార్థిద్దాం..’’ అని పోస్ట్ పెట్టారు.
#Valimai #AjithKumar @ZeeStudios_ @BayViewProjOffl #Vinoth #Niravshah @SureshChandraa @thisisysr @dhilipaction @DoneChannel1 pic.twitter.com/ojvavsNVt3
— Boney Kapoor (@BoneyKapoor) April 23, 2021
ఇక యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను ‘బేవ్యూ ప్రాజెక్ట్స్’ బ్యానర్ పై బోనీ కపూర్ నిర్మిస్తున్నాడు. ఇందులో కథానాయికగా బాలీవుడ్ నటి హుమా ఖురేషి నటిస్తుండగా… టాలీవుడ్ హీరో కార్తికేయ విలన్‌గా కనిపించనున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు. అన్ని పనులు త్వరలోనే పూర్తి చేసి సినిమాను కూడా తొందర్లోనే రిలీజ్ చేసే ప్లాన్ చేస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: