బాలనటుడిగా ఎన్నోసినిమాల్లో నటించిన తేజ సజ్జా.. ఇటీవలే హీరోగా జాంబిరెడ్డి సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. ఇక హీరోగా తన మొదటి సినిమాతోనే మంచి పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం తేజ తన రెండో సినిమా ఇష్క్ సినిమాతో బిజీగా ఉన్నాడు. రాజు దర్శకత్వంలో తేజ, ప్రియా ప్రకాష్ వారియర్ హీరో హీరోయిన్లు గా వస్తున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి పలు పోస్టర్ల న, టీజర్ ను రిలీజ్ చేయగా వాటికి మంచి స్పందనే లభించింది. అంతేకాదు రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేశారు. ఏప్రిల్ 23న రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాాజాగా ఈసినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేశారు. రేపు ఉదయం 10 గంటల 36 నిమిషాలకు ట్రైలర్ ను రిలీజ్ చేస్తామని ప్రకటించారు.
కాగా ఆర్.బి. చౌదరి ఈ మూవీకి సమర్పకులుగా వ్యవహరిస్తున్న ఈసినిమాను ఎన్వీ ప్రసాద్, పారస్ జైన్, వాకాడ అంజన్ కుమార్ నిర్మిస్తున్నారు. మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తుండగా.. శ్యామ్ కె. నాయుడు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. మరి ఈ యేడాది ఫిబ్రవరి 5న విడుదలైన ‘జాంబిరెడ్డి’ తో మంచి హిట్ కొట్టాడు తేజ. అదే నెలలో వచ్చిన ‘చెక్’లో ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోయిన్ గా నటించింది. మరి ఇప్పుడు వీరిద్దరూ జంటగా నటిస్తున్న ‘ఇష్క్’ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: