ర‌ణ్‌వీర్ తో ‘అపరిచితుడు’ రీమేక్

Ace Director Shankar Announces Anniyan Movie Hindi Remake With Ranveer Singh,Telugu Filmnagar,Telugu Film News 2021,Ranveer Singh Collaborates With Shankar For The Hindi Remake Of Vikram's Anniyan,Ranveer Singh To Star In Hindi Remake Of Director Shankar's Anniyan,Anniyan,Anniyan Movie,Anniyan Film,Anniyan Movie Update,Shankar Announces The Hindi Remake Of Anniyan With Ranveer Singh,Director Shankar,Shankar,Director Shankar Latest News,Anniyan Movie Hindi Remake,Anniyan Remake,Anniyan Hindi Remake,Ranveer Singh Anniyan Remake,Ranveer Singh And Shankar Team Up For Anniyan Bollywood Remake,Shankar Next With Ranveer Singh Announced,Anniyan Hindi Remake,Ranveer Singh Next Film Anniyan Remake,Anniyan Hindi Remake Announcement,Ranveer Singh,Actor Ranveer Singh,Ranveer Singh New Movie,Ranveer Singh In Aparichitudu Remake,Aparichitudu Movie,Aparichitudu Remake

సౌత్ సినిమాలు ఇప్పుడు చాలానే హిందీలో రీమేక్ అవుతున్నాయి. ఇక ఇప్పుడు మరో ఎవర్ గ్రీన్ సినిమాకూడా రీమేక్ అవ్వడానికి సిద్దంగా ఉంది. శంకర్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా వచ్చిన సినిమా అపరిచితుడు ఎన్ని సంచలనాలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 2005లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం సృష్టించిన సునామీ అంతా ఇంతా కాదు. అవినీతి అంటే ఇష్టపడని పాత్రలో స్ప్లిట్ పర్సనాలిటీ డిజార్డర్ ఉన్న వ్యక్తిగా మూడు పాత్రల్లో అద్భుతంగా నటించిన చియాన్ విక్రమ్ నటనకు పట్టాం కట్టారు అందరూ. ఇక ఇప్పుడు ఈసినిమాను హిందీలో కూడా రీమేక్ చేయనున్నాడు శంకర్. ఈవిషయాన్ని స్వయంగా ఆయనే తన ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక రణ్ వీర్ కూడా ఇన్‌స్టా గ్రామ్ లో ఈవిషయాన్ని చెబుతూ సంతోషాన్ని వ్యక్తం చేశాడు. అద్భుత‌మైన సినిమాటిక్ విజ‌న్ ఉన్న శంక‌ర్ స‌ర్‌తో మూవీ చేస్తుండ‌టం త‌న అదృష్ట‌మ‌ని ఎప్ప‌టికైనా ఆయ‌న‌తో మూవీ చేయాల‌ని తాను భావించేవాడిన‌ని, అప‌రిచితుడులాంటి మూవీలో లీడ్ రోల్ అంటే త‌న క‌ల నిజ‌మైన‌‌ట్లే ఉందని తెలిపాడు.

కాగా ఈసినిమాను పెన్ మూవీస్ బ్యానర్ పై జయంతిలాల్ పాన్ ఇండియా మూవీగా నిర్మించనున్నారు. ఇక రణ్‌వీర్ నటించిన ‘సూర్యవంశీ, 83’ సినిమాలు రిలీజ్ కి సిద్ధంగా ఉన్నాయి. ఇక ‘జయేష్‌భాయ్ జోర్ దార్’ షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. ‘సర్కస్’ షూటింగ్ లో ఉంది. మరి విక్రమ్ అపరిచితుడు సినిమాలో తన నట విశ్వరూపం చూపించాడు. రణ్ వీర్ మరి విక్రమ్ ను మరపించేలా చేస్తాడేమో చూద్దాం..

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − 5 =