‘వకీల్ సాబ్’ అదే వేడి.. అదే వాడి

Megastar Chiranjeevi Shares A Heartfelt Note For Pawan Kalyan’s Vakeel Saab Movie,Telugu Filmnagar,Telugu Film News 2021,Vakeel Saab,Vakeel Saab Movie,Vakeel Saab Telugu Movie,Vakeel Saab Update,Vakeel Saab Movie Update,Vakeel Saab Movie News,Pawan Kalyan,Power Star Pawan Kalyan,Pawan Kalyan Vakeel Saab,Pawan Kalyan Vakeel Saab Telugu Movie Update,Megastar Chiranjeevi,Chiranjeevi,Chiranjeevi Lauds Vakeel Saab Act As Terrific,Megastar Chiranjeevi Heartfelt Note For Vakeel Saab,Chiranjeevi Shares A Heartfelt Message On Vakeel Saab,Megastar Chiranjeevi Heaps Praises on Power Star’s Vakeel Saab,Chiranjeevi Says Terrific Act By Pawan Kalyan,Chiranjeevi Latest Tweet,Megastar Chiranjeevi About Vakeel Saab Movie,Chiranjeevi On Pawan Kalyan’s Vakeel Saab,Sriram Venu,#VakeelSaab

నిన్నటి నుండి ఎక్కడ చూసినా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా వకీల్ సాబ్ గురించే వినిపిస్తుంది. కరోనా తరువాత థియేటర్లు ఓపెన్ అయిన తరువాత ఇంత సందడి.. హడావుడి మరే సినిమాకు కనిపించలేదు. ఇక ఈసినిమా కూడా అదే రేంజ్ లో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తుంది. మరోసారి పవన్ మ్యానియా ఏంటో వకీల్ సాబ్ సినిమా చూపించింది.

ఇక ఈసినిమాపై చిరు కూడా ప్రశంసలు కురిపిస్తున్నాడు. ఇప్పటికే తన ఫ్యామిలితో కలిసి సినిమా చూసిన చిరు సినిమాపై, పవన్ పై, చిత్రయూనిట్ పై తన ట్విట్టర్ ద్వారా ప్రశంసలు కురిపించారు. ”మూడేళ్ళ తర్వాత పవన్ కళ్యాణ్‌లో అదే వేడి.. అదే వాడి.. అదే పవర్. ప్రకాష్ రాజ్ తో కోర్ట్ రూమ్ డ్రామా అద్భుతం. నివేదా థామస్, అంజలీ, అనన్య వారి పాత్రల్లో జీవించారు. థమన్, డీఓపీ వినోద్ సినిమాకు ప్రాణం పోశారు. దిల్ రాజు, బోనీ కపూర్ .. దర్శకుడు వేణు శ్రీరామ్ కు మిగతా టీమ్ అందరికీ నా శుభాకాంక్షలు. అన్నిటికి మించి ఇది మహిళలకు ఇవ్వాల్సిన గౌరవాన్ని తెలియజేసే ఒక అత్యవసరమైన చిత్రం. ఈ వకీల్ సాబ్ కేసులనే కాదు అందరి మనసులను గెలుస్తాడు!” అంటూ ‘వకీల్‌ సాబ్‌’ సినిమాపై చిరు ట్వీట్ చేశారు. అంతేకాదు తాజాగా చిరు ‘వకీల్‌ సాబ్‌’ చిత్ర దర్శకనిర్మాతలను కూడా సత్కరించారు. నిర్మాత దిల్ రాజు.. ద‌ర్శ‌కుడు వేణు శ్రీ‌రామ్‌లను తన నివాసంలో అభినందించి చిత్రం విజ‌యం సాధించినందుకు శుభాకాంక్ష‌లు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here