2022 సంక్రాంతి బరిలోకి ‘పొన్నియన్‌ సెల్వన్‌’..!

Mani Ratnam’s Ponniyin Selvan Aiming For Sankranti Release,Telugu Filmnagar,Telugu Film News 2021,Mani Ratnam’s Ponniyin Selvan,Ponniyin Selvan,Ponniyin Selvan Movie,Ponniyin Selvan Film,Ponniyin Selvan New Update,Ponniyin Selvan Movie Update,Ponniyin Selvan Movie News,Ponniyin Selvan Movie Latest Update,Ponniyin Selvan Movie Latest News,Mani Ratnam Ponniyin Selvan Movie Update,Mani Ratnam,Director Mani Ratnam,Mani Ratnam New Movie,Mani Ratnam Movies,Update About Ponniyin Selvan Shoot,Ponniyin Selvan Shoot,Ponniyin Selvan Shooting Update,Ponniyin Selvan Movie Release,Mani Ratnam’s Ponniyin Selvan Sankranti Release,Ponniyin Selvan Release Date,Ponniyin Selvan Release For Sankranthi,Ponniyin Selvan Sankranti Release

మణిరత్నం ‘పొన్నియన్‌ సెల్వన్‌’ అనే సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ప్రముఖ నవలారచయిత కల్కీ రాసిన నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. భారీ బడ్జెట్ తో ఈ సినిమాను రూపొందిస్తుండటంతో మణిరత్నం కూడా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈసినిమాకు నటీనటులను కూడా అదే రేంజ్ లో తీసుకున్నాడు. ఇక ఈసినిమా షూటింగ్ కూడా ఎప్పుడో మొదలైంది. ఇప్పటికే డెబ్బై శాతం చిత్రీకరణ కూడా పూర్తయ్యింది. మధ్యలో కోరనా వల్ల షూటింగ్ బ్రేక్ పడింది కానీ లేకపోతే ఈపాటికి షూటింగ్ పార్ట్ పూర్తయి ఉండేది. మళ్లీ ఇటీవలే షూటింగ్ ను మొదలుపెట్టాడు మణిరత్నం.

ఇప్పుడు సెకండ్ వేవ్ అంటూ మరోసారి షూట్ కు అడ్డంకి ఏర్పడింది. రీసెంట్‌గా మధ్య ప్రదేశ్‌లో ఓ షెడ్యూల్‌ను మణిరత్నం ప్లాన్‌ చేయగా కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ కారణంగా అనుమతులు లభించలేదు. దీంతో హైదరాబాద్‌, చెన్నైల్లో ఈ షెడ్యూల్‌ను పూర్తి చేయాలని ప్లాన్‌ చేస్తున్నారు. ఎలాగూ షూటింగ్ చివరి దశకు వచ్చేసింది.. షూటింగ్ కు బ్రేక్ పడినా.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా చూసుకుంటూ.. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలోకి ‘పొన్నియన్‌ సెల్వన్‌’ తీసుకురావాలని మణిరత్నం ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఏలాగూ ఇంకా చాలా టైమ్ ఉంది… సంక్రాంతికి రిలీజ్ చేయడం అంత కష్టమైన పని కాకపోవచ్చు. చూద్దాం మరి ఏం జరుగుతుందో.

కాగా ఈ సినిమాలో ఐశ్వర్య రాయ్, త్రిష, జయం రవి, విక్రమ్, కీర్తి సురేష్, విజయ్ సేతుపతి, కార్తి, ఐశ్వర్య లక్ష్మి, మోహన్ బాబు, జయ రాం, ప్రభు లాంటి స్టార్లు నటించనున్నారు. మద్రాస్‌ టాకీస్, లైకా ప్రొడక్షన్స్‌ బ్యానర్స్ లో సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here