‘సమ్మోహనం’, ‘వి’ సినిమాల తర్వాత హీరో సుధీర్ బాబు, దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్లో వస్తున్న మూడో చిత్రం ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. ఇటీవలే ఈసినిమా టైటిల్ ను ప్రకటించారు. ఇక ఇదిలా ఉండగా నేడు ఈసినిమా షూటింగ్ లో సుధీర్ బాబు కూడా జాయిన్ అవుతున్నట్టు తెలుపుతున్నాడు. ఈసందర్భంగా సుధీర్ బాబు తన ట్విట్టర్ లో ఈసినిమా షూటింగ్ లో పాల్గొంటున్నా.. మరోసారి ఇంద్రగంటి గారితో సినిమా చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
Guys … Have started shooting for #AAGMC … Great feeling to rejoin the elite company of #IndragantiMohanaKrishna. It feels like home ☺️@IamKrithiShetty @pgvinda @benchmarkstudi5
— Sudheer Babu (@isudheerbabu) March 25, 2021
కాగా ఈసినిమాలో సుధీర్ బాబు సరసన కృతిశిట్టి హీరోయిన్‌గా నటిస్తుంది. ఇంకా ఈసినిమాలో అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిశోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, కళ్యాణీ నటరాజన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.గాజులపల్లె సుధీర్ బాబు సమర్పణలో బెంచ్‌మార్క్ స్టూడియోస్ బ్యానర్‌పై బి.మహేంద్రబాబు, కిరణ్ బల్లపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బెంచ్‌మార్క్ స్టూడియోస్ నిర్మిస్తోన్న తొలి చిత్రమిది. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు… పి.జి.విందా సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
ఇక మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తచ్చుకుంది కృతిశెట్టి. ఇక ఈసినిమా టైటిల్ ను బట్టి హీరోయిన్ కు చాలా ఇంపార్టెన్స్ఉందన్న విషయం అర్థమవుతుంది. అందులోనూ తన సినిమాల్లో హీరోయిన్ రోల్స్‌కు చాలా ప్రాముఖ్యం ఇచ్చి, వారిని తెరపై అందంగా ప్రెజెంట్ చేయడంలో ఇంద్రగంటి దిట్ట. మరి ఈసినిమా కృతి శెట్టికి మరో గుర్తుండిపోయే సినిమా అవుతుందేమో చూద్దాం.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
తెలుగు ఫుల్ మూవీస్
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.