బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి సమర్పణలో యంగ్ హీరో శ్రీ విష్ణు, లవ్‌లీ సింగ్ హీరోహీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం గాలి సంపత్. నటకిరీటి డా. రాజేంద్ర ప్రసాద్ టైటిల్ రోల్ పోషిస్తున్నారు. అనిల్ ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరించడంతో పాటు స్క్రీన్‌ప్లే, దర్శకత్వ పర్యవేక్షణ కూడా చేస్తుండడం విశేషం. అనిల్ కో-డైరెక్టర్, రైటర్, మిత్రుడు ఎస్. క్రిష్ణ నిర్మాతగా ఇమేజ్ స్పార్క్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌ను స్థాపించి షైన్ స్క్రీన్స్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనీష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ మార్చి 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతుంది. ఈ సందర్భంగా గాలి సంపత్ చిత్ర యూనిట్ గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించింది చిత్ర యూనిట్. ఈ కార్యక్రమానికి ఎనర్జిటిక్ స్టార్ రామ్ ముఖ్య అతిథిగా వచ్చాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్భంగా రామ్ మాట్లాడుతూ – “మా స్రవంతి మూవీస్ బ్యానర్ స్టార్ట్ అయ్యిందే రాజేంద్ర ప్రసాద్ గారి లేడిస్ టైలర్ సినిమాతో..ఆయన సినిమాలు వస్తున్నాయంటే చాలు హ్యాపీగా నవ్వుకోవచ్చు. ఆయన పేరు ముందు ఏ బిరుదు పెట్టినా అది చాలా చిన్నగా కనపడుతుంది. సినిమా పరిశ్రమకి దొరికిన ట్రెజర్ ఆయన. గాలి సంపత్ సినిమాకి రాజేంద్ర ప్రసాద్ గారికి హండ్రెడ్ పర్సెంట్ నేషనల్ అవార్డ్ రావాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాలో ఆయన యాక్టింగ్ చూడగానే ఇది తప్పకుండా అవార్డ్ విన్నింగ్ ఫిలిం అనిపించింది. శ్రీ విష్ణు మంచి స్నేహితుడు. మోస్ట్ జెన్యూన్ పర్సన్. ఈ సినిమా శ్రీ విష్ణుకి కూడా మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను. నిర్మాతలు సాహూ గారికి, హరీష్ గారికి ఆల్ ది బెస్ట్. ఈ సినిమాతో నిర్మాతగా పరిచయం అవుతున్న రైటర్ సాయి నాకు చాలా కాలంగా తెలుసు. ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే రాజ్ కుమార్ హిరాణి స్టైల్ కనిపించింది. ఈ సినిమా సాయి కెరీర్‌లోనే కాదు ఇండస్ట్రీలో కూడా ఒక మైల్ స్టోన్ మూవీ అవ్వాలని కోరుకుంటున్నాను. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. డైరెక్టర్ అవ్వకముందు నుండి అనిల్ ఎన్నో సూపర్‌హిట్ సినిమాలను సూపర్‌వైజ్ చేశారు. డైరెక్టర్ నుండి ప్రొడ్యూసర్ గా ఎదిగిన అనిల్ జర్నీ చూసి చాలా గర్వంగా ఉంది.. ఈ సినిమా కూడా మంచి విజయం దక్కించుకుంటుంది.. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్“ అన్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: