‘కార్తికేయ2’ లో అనుపమ్ ఖేర్

Anupam Kher To Play A Pivotal Role In Karthikeya 2 Movie,Telugu Filmnagar,Telugu Film News 2021,Tollywood Movie Updates,Anupam Kher,Actor Anupam Kher,Anupam Kher In Karthikeya 2,Karthikeya 2,Karthikeya 2 Movie,Karthikeya 2 Telugu Movie,Karthikeya 2 Update,Karthikeya 2 Movie Latest News,Karthikeya 2 Movie Latest Updates,Anupam Kher Joins The Cast Of Karthikeya 2 Movie,Anupam Kher Joins Karthikeya 2,Anupam Kher Joins Karthikeya 2 Movie,Anupam Kher In Karthikeya 2 Telugu Movie,Anupam Kher Karthikeya 2,Team Karthikeya 2 Welcomes One Of The Biggest Actors Anupam Kher,Karthikeya 2 Team Welcomes Anupam Kher,Happy Birthday Anupam Kher,Anupam Kher As Dhanvantri,Dhanvantri Karthikeya 2,Anupam Kher Karthikeya 2 Movie,Nikhil Siddharth,Hero Nikhil Karthikeya 2,Anupam Kher joins Nikhil Starrer Karthikeya 2

నిఖిల్‌, చందు మెుండేటి కాంబినేష‌న్ లో వచ్చిన ‘కార్తికేయ’ సినిమా ఎంత హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఈసినిమా సీక్వెల్ ను కూడా తెరకెక్కిన సంగతి తెలిసిందే కదా. గత ఏడాదే తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో ‘కార్తికేయ 2’ ను పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ఆతరువాత రెగ్యులర్ షూటింగ్ కు కరోనా వల్ల బ్రేక్ పడింది. ఈసినిమా సినిమా నుండి ఇప్పటికే పలు పోస్టర్ లు కూడా రిలీజ్ చేశారు. మరోవైపు ఈసినిమాకు సంబంధించి ప్రీ పొడ‌క్షన్ త‌దిత‌ర కార్యక్రమాలు ప‌క్కగా పూర్తి చేసుకుని త్వర‌లోనే సెట్స్ మీద‌కి వెళ్లడానికి ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉంటే, ఈ సినిమాలో ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కీలక పాత్రలో నటించనున్నారు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థలు ప్రకటించాయి. అనుపమ్ ఖేర్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన ‘కార్తికేయ 2’లో నటిస్తున్నట్టు ప్రకటించారు నిర్మాతలు. ఈ సినిమాలో అనుపమ్ ఖేర్ ధన్వంత్రి అనే పాత్రలో నటిస్తున్నారు.

కాగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకం పై నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ నటిస్తుంది. మరి నిఖిల్ కెరీర్లో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన కార్తికేయ సినిమాకు సీక్వెల్ గా వస్తుండటంతో ఈ మూవీ పై అంచనాలు భారీగానే ఉన్నాయి. చూద్దాం కార్తికేయ2 ఎంత వరకూ సక్సెస్ అవుతుందో..

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 4 =